
NTR- Koratala Siva Movie: ఏమంటూ రాజమౌళి పాన్ ఇండియా కాన్సెప్ట్ తెచ్చాడో గానీ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఏళ్లకు ఏళ్ల సమయం తీసుకుంటున్నారు. సరే రెండేళ్లో మూడేళ్లో షూటింగ్ జరుగుతూ ఉంటే పర్లేదు. అసలు శ్రీకారమే చుట్టకపోతే ఎలా? ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందనుకోవాలి?. ఎన్టీఆర్ 30 విషయంలో అభిమానుల వేదన ఇదే. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందే ఎన్టీఆర్ తన 30వ చిత్రం ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అటు త్రివిక్రమ్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ ఖాళీగా లేరు. ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేదు. దీంతో పక్కన పట్టేశారు.
త్రివిక్రమ్ మహేష్ ని వెతుక్కోగా… ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చాడు. కొరటాలేమో అల్లు అర్జున్ తో ప్రకటించిన మూవీ పక్కన పెట్టి ఎన్టీఆర్ తో జతకట్టాడు. ఇక ఎన్టీఆర్ 30 విషయంలో పెద్ద హైడ్రామా నడిచింది. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ నచ్చలేదని, మార్పులు సూచించారని కథనాలు వెలువడ్డాయి. ఒక దశలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారన్న వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చిన కొరటాల పరోక్షంగా రూమర్స్ కి చెక్ పెట్టాడు.
ఆర్ ఆర్ ఆర్ మూవీకి నాలుగేళ్లు కేటాయించిన ఎన్టీఆర్ ఈ సినిమా కూడా డిలే చేయడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. తమ అసహనాన్ని అమిగోస్ ప్రీ రిలీజ్ వేడుకలో చూపించారు. ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలంటూ నానా అల్లరి చేశారు. చేసేది లేక ఎన్టీఆర్ ఫిబ్రవరిలో పూజా, మార్చిలో రెగ్యులర్ షూట్ అని వెల్లడించారు. మాట నిలబెట్టుకున్న ఎన్టీఆర్ కొరటాల మూవీ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంలో మార్చి 24న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహిస్తున్నారు.

దేశం మొత్తం న్యూస్ అయ్యేలా టాప్ స్టార్స్ ని గెస్ట్స్ గా పిలుస్తున్నారట. ఇక మార్చి నుండి ఎన్టీఆర్ 30 షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతవరకు అధికారికంగా ఎవర్నీ ప్రకటించలేదు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఓ స్టార్ హీరో విలన్ గా నటించనున్నారట. 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 థియేటర్స్ లోకి రానుంది.