NTR Birthday: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు.1983 మే 20వ తేదీన నందమూరి హరికృష్ణ షాలిని దంపతులకు జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు. హరికృష్ణ కి అప్పటికే లక్ష్మీ గారితో పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు…అయినప్పటికి షాలిని గారిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఎన్టీఆర్ జన్మించినప్పటి నుంచి కూడా వాళ్ళను నందమూరి ఫ్యామిలీతో కలవనిచ్చే వారు కాదు…వాళ్ళు ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఉండేవారు…వాళ్ళకి కావాల్సిన అన్నింటిని హరికృష్ణ చూసుకునేవాడు. కానీ ఇంటికి మాత్రం రాణించే వారు కాదు..
Also Read: చంద్రబాబుకు బిల్ గేట్స్ లేఖ
ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్ తల్లి షాలిని…ఎలాగైనా ఎన్టీఆర్ ను ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలంటే ఇతన్ని హీరోను చేయాలి అని తనకి చిన్నప్పటి నుంచే డాన్స్ లు నేర్పించింది. ఇక రామాయణం లో రాముడి గురించి చెప్పి ఆయన వనవాసం ఎలా చేశాడు ఎందుకు చేశాడో వివరంగా చెప్పేదట…అలాగే నువ్వు ఎప్పటికైనా వనవాసం ముగించుకున్న రాముడిలా నందమూరి ఫ్యామిలీ వాళ్ళతో కలవాలి అని బలంగా చెప్పెదట…అప్పుడే ఎన్టీఆర్ వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడట…అందుకే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఇంకెన్నో చిత్కారాలు ఎదుర్కొన్నప్పటికి అతి భరించి నిలబడి సినిమా హీరోగా ఎదిగాడు…
అప్పటినుంచి సినిమాల కోసమే పరితపిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడానికి ముందుకు సాగుతున్నాడు.మొత్తానికి తను అనుకున్న లక్ష్యాన్ని చేరాడు. వాళ్ళ ఫ్యామిలీ లోకి అతనికి ఘనంగా స్వాగతం పలికారు…మఇక ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న చాలామంది హీరోలకు సవాళ్లను కూడా విసురుతు స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు… ఇప్పుడు ఎన్టీఆర్ డాన్స్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా రిహార్సల్ ఎందుకు చేయాడు అంటే చిన్నతన లోనే విపరీతమైన డాన్స్ లు చేసి అత్యుత్తమమైన పర్ఫామెన్స్ లను ఇచ్చి ఎన్నో వందల అవార్డులను కూడా గెలుచుకున్నాడు.
చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మతో ఉండటంవల్ల ఎన్టీఆర్ కి బాధ్యతలు ఏంటో తెలుసాయి. ప్రస్తుతం ఆయన ఇండియాలో ఉన్న అత్యంత తక్కుమంది స్టార్ హీరోల్లో ఒకడిగా ముందుకు సాగుతున్నాడు… ప్రస్తుతం ప్రశాంత్ నీళ్లతో చేస్తున్న డ్రాగన్ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ తన 42 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు… ఇక తను ఆరోగ్యంగా ఉంది మంచి సక్సెస్ ఫుల్ సినిమాలను చేయాలని కోరుకుందాం…