https://oktelugu.com/

Janhvi Kapoor: ఎన్టీఆర్ 30: జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రివ్యూ…

Janhvi Kapoor: ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై నేడు అధికారిక ప్రకటన వచ్చింది. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ‘తుఫానులో ప్రశాంతత’ అని కోట్ ఇచ్చారు. లంగా ఓణీలో జాన్వీ కపూర్ లుక్ అద్భుతంగా ఉంది. తుఫానులో ప్రశాంతత అని చెప్పడం ద్వారా.. ఆమె క్యారెక్టర్ ఎన్టీఆర్ 30 మూవీలో చాలా డీసెంట్ అండ్ హంబుల్ నెస్ కలిగి ఉంటుందనిపిస్తుంది. లంగా ఓణీలో […]

Written By:
  • Shiva
  • , Updated On : March 6, 2023 / 11:51 AM IST
    Follow us on

    Janhvi Kapoor

    Janhvi Kapoor: ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై నేడు అధికారిక ప్రకటన వచ్చింది. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ‘తుఫానులో ప్రశాంతత’ అని కోట్ ఇచ్చారు. లంగా ఓణీలో జాన్వీ కపూర్ లుక్ అద్భుతంగా ఉంది. తుఫానులో ప్రశాంతత అని చెప్పడం ద్వారా.. ఆమె క్యారెక్టర్ ఎన్టీఆర్ 30 మూవీలో చాలా డీసెంట్ అండ్ హంబుల్ నెస్ కలిగి ఉంటుందనిపిస్తుంది. లంగా ఓణీలో ప్రజెంట్ చేసిన క్రమంలో జాన్వీ పాత్ర పల్లెటూరి నేపథ్యం కలిగి ఉండే అవకాశం కలదు. మొత్తంగా జాన్వీ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

    Also Read: Venkatesh Maha On KGF2: ‘వాడో నీచ్ కమీన్ కొత్తే’ అదేం సినిమా… కెజిఎఫ్ డైరెక్టర్ పై కంచరపాలెం డైరెక్టర్ సంచలన కామెంట్స్

    జాన్వీ కపూర్ ని సౌత్ కి తీసుకురావాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె తల్లి శ్రీదేవి తెలుగు, తమిళ పరిశ్రమలను దశాబ్దాల పాటు తిరుగులేని హీరోయిన్ గా ఏలారు. బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ కూడా సంచలనాలు నమోదు చేశారు. ఇక ఎన్టీఆర్ తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలు చేశారు. ఈ క్రమంలో శ్రీదేవి కూతురు జాన్వీ సీనియర్ ఎన్టీఆర్ మనవడు సరసన నటించడం అరుదైన కాంబినేషన్ అని చెప్పాలి.

    Also Read: Amitabh Bachchan: బ్రేకింగ్ : ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కి తీవ్ర గాయాలు..అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

    ఈ నెలలో ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ చిత్ర కథపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్, గోవా నగరాల్లో స్పెషల్ సెట్స్ వేస్తున్నారట. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ 30 ప్రతి పోస్టర్లో సముద్రం హైలెట్ చేస్తున్నారు. సీ పోర్ట్ సినిమా ప్రధాన ఇతివృత్తం అని ప్రచారం జరుగుతుండగా… పోస్టర్స్ బలం చేకూర్చుతున్నాయి.

    Janhvi Kapoor, ntr

    ఎన్టీఆర్ 30 విడుదల తేదీ కూడా ప్రకటించారు. 2024 ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, శ్రీకర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అనుకున్న సమయం కంటే మూవీ బాగా లేటైంది. దర్శకుడు కొరటాల రాసిన స్క్రిప్ట్ కి ఎన్టీఆర్ మార్పులు చేర్పులు కోరారని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ విడుదలై ఏడాది కావస్తున్నా ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లలేదని అభిమానులు ఒకింత అసహనంగా ఉన్నారు.

    https://twitter.com/NTRArtsOfficial/status/1632616274131042304