Zip Saree: ఆడవారి అందం గురించి మాట్లాడేటప్పుడు చీర విషయం తప్పకుండా మాట్లాడుతారు. ఎందుకంటే ఆడవారు అందంగా కనిపించడానికి చీరలు ఉపయోగపడుతాయి. చీర కట్టు ద్వారా కొందరు ప్రత్యేకంగా అందంగా కనిపిస్తారు. చీరకట్టులో ఉన్న గొప్పదనం గురించి ‘ సినిమాలో ప్రత్యేకంగా పాట కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే నేటి కాలంలో యువతులు చీర కట్టు గురించి పట్టించుకోవడం లేదు. జీటన్స్, టీషర్ట్ వేసేవారు కొందరైతే.. పంజాబీ ఇతర డ్రెస్సులతో మరికొందరు కనిపిస్తున్నారు. అయితే విదేశాల్లో ఉండేవారు మాత్రం చీర కట్టు గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. చాలా దేశాల్లో చీరతో కనిపిస్తున్నారు. ఇప్పుడున్న కాలంలో చాలా మంది యువతులకు చీర కట్టుకోవడం ఎలాగే తెలియదు. ఇలాంటి వారు చింతినక్కర్లేదు. ఎందుకంటే ఇలా చేసి 10 సెకన్లలో చీరకట్టుకోవచ్చు. అదెలాగంటే?
నేటి కాలంలో చీరకట్టు గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కానీ పూర్వ కాలంలో మహిళలు చీరలోనే కనిపించారు. అలా ఒకరి తరువాత ఒకరు చీర కట్టుకోవడం గురించి తెలుసుకున్నారు. కానీ ఇప్పుడున్న కాలంలో చీరకట్టేవారి సంఖ్య తగ్గుతుండడంతో దాని గురించి మరిచిపోతున్నారు.అయితే విదేశాల్లో మాత్రం చీర గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. చీర కట్టడం ఎలాగో తెలుసుకొని వాటినే ధరిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ యువతి నేటి కాలం వారికి ఈజీగా చీర కట్టడం ఎలాగో తెలిపింది.
సాధారణంగా చీర కట్టడం అంటే చాలా సమయం పడుతుంది.ఏదైనా శుభ కార్యాలయాలకు వెళ్లినప్పుడు, ప్రత్యేక రోజుల్లో చీర కట్టడంలో అనుభవం ఉన్నవారు సైతం సరి చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఓ యువతి కేవలం 10 సెకన్లలో చీరకట్టుకోవచ్చని నిరూపిస్తుంది. అయితే ఈ చీరకు ‘జిప్ అండ్ గో’ అని పేరు పెట్టింది. ఇందుకు సంబంధించి ఓవీడియోను ‘హన్సా జరూరీ హే’ అనే ఎక్స్ ఖాతాలో అప్లోడ్ చేసింది. ఇందులో బ్లూ కలర్ సారీని ఓ యువతి చాలా చాకచక్యంగా చుట్టేస్తుంది. చీరకు బ్లౌస్ ఫిక్స్ అయి ఉంటుంది. దీనిని డ్రెస్ లాగా ధరించినా.. చివరికి చీరలాగే కనిపిస్తుంది. అంతేకాకుండా అందంగా కనిపిస్తుంది.
ఈ వీడియోను చూసిన చాలా మంది చీరకట్టు గురించి ఆ యువతి చేసిన ప్రయోగంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి కాలంలో మనదేశంలో చీరకట్టేవారి సంఖ్య తగ్గుతోంది. విదేశాల్లో మాత్రం శ్రద్ధ వహించి మరీ ఇష్టంగా చీరను ధరిస్తున్నారు. దీంతో సాంప్రదాయాన్ని మరిచిపోకుండా ఉండడానికి ఈ యువతి చేసిన ప్రయత్నం ఫలిస్తుందని కొందరు కొనియాడుతున్నారు. అయితే చీరకట్టడం ఎంత ఈజీ అయినా చాలా మంది డ్రెస్సుల్లోనే కన్వినెంట్ గా ఉంటామని భావిస్తుంటారు. అన్ని సందర్భాల్లో చీర కట్టుతో ఉండడం సాధ్యం కాదు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందిగా ఉంటాయి.
అయితే కొన్ని ప్రత్యేక రోజుల్లో, సాంప్రదాయ పండుగల్లో చీరతోనే అందంగా కనిపిస్తారు. ఈ సమయంలో చీరను ధరించడం సాంప్రదాయంతో పాటు కల్చర్ ను తెలుపుతుందని కొందరు పెద్దలు అంటున్నారు. అయితే చీరకట్టడంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. నేటి కాలంలో అవి కనుమరుగు అయిపోతున్నారు. కొందరు మాత్రం ఈ సాంప్రదాయాలను మరిచిపోకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా చీరపై ముగవల మనసు మారుతుందా? లేదా? చూడాలి.
लो बहन, अब zip वाली साड़ी भी आ गई मार्केट में
pic.twitter.com/K87GmzJqhU— HasnaZarooriHai (@HasnaZaruriHai) December 3, 2024