https://oktelugu.com/

Jobs News in 2025 : కొత్త సంవత్సరంలో భారీ ఉద్యోగాలు.. ఎందులో ఎన్ని ఖాళీలు? విద్యార్హత, అప్లే వివరాలు..

2025 సంవత్సరం ప్రారంభ నెల అయిన జనవరిలోనే నోటిఫికేషన్లు విడుదల చేశారు అధికారులు. ముఖ్యంగా సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఎన్ఎల్సీ ఇండియా, కోచిన్ షిప్‌యార్డ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైల్వే, వంటి సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. మరి ఈ సంస్థల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వివరాలు తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 3, 2025 / 09:40 PM IST

    Jobs News in 2025

    Follow us on

    Jobs News in 2025 :  కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవలేదు. దీంతో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు అందరి ఎదురుచూపులు ఫలించాయి. దేశంలోని వివిధ విభాగాలు, శాఖలు, సంస్థల్లో ఖాళీలను నింపేందుకు ప్రభుత్వం సిద్దం అయింది. 2025 సంవత్సరం ప్రారంభ నెల అయిన జనవరిలోనే నోటిఫికేషన్లు విడుదల చేశారు అధికారులు. ముఖ్యంగా సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఎన్ఎల్సీ ఇండియా, కోచిన్ షిప్‌యార్డ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైల్వే, వంటి సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. మరి ఈ సంస్థల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వివరాలు తెలుసుకుందాం.

    కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ సంస్థలో వివిధ విభాగాల్లో శిక్షణ ఉద్యోగాలకు నియామకాలు జరుగుతున్నాయి. 27 సంవత్సరాల వయస్సు వరకు అప్లే చేసుకోవచ్చు. మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ విద్యార్హత ఉన్న వారు అప్లే చేసుకోవచ్చు. అంతేకాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్ జలమార్గాలు అన్ని కూడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఉంటుంది. అయితే ఈ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు 06.01.2024 చివరి తేదీ.

    సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ సంస్థలోని పలు విభాగాల్లో ఖాళీలను పూరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్ట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగాల్లో 44 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 28 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 07.01.2025, 09.01.2025 వరకు ఉంది. మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.

    భారతీయ రైల్వేల్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంస్థలో కూడా 11 ఖాళీలను పూరించనున్నారు అధికారులు. ప్రత్యక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. 55 సంవత్సరాల లోపు వారు ప్రయత్నించవచ్చు. ఇంటర్వ్యూ తేదీలు 09.01.2025 మరియు 10.01.2025. పూర్తి వివరాలు కోసం ఇండియన్ రైల్వే అఫీషియల్ వెబ్ సైట్ లో సెర్చ్ చేయవచ్చు.

    సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లో కూడ చాలా ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 179 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ జాబ్ కి అప్లై చేయాలంటే 30 సంవత్సరాల వయసు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ : 12.01.2025.

    ఎన్ఎల్సీ ఇండియాలో 167 ట్రైనింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. GATE పరీక్ష స్కోరు ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. దీనికి అప్లై చేయాలంటే 30 ఏళ్లు దాటి ఉండకూడదు. ఈ పోస్టుల దరఖాస్తుకు 15.01.2025 చివరి తేదీ. ఇక ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాల తెలుసుకోవడానికి సంబంధిత వెబ్ సైట్ లకు వెళ్లి అప్లే చేసుకోవచ్చు.