
Balakrishna- Anil Ravipudi: ఉగాది పర్వదినాన ఫ్యాన్స్ కు బాలయ్య అదిరిపోయే న్యూస్ చెప్పాడు. తన రాబోయే సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ఇప్పటికే బాలయ్య 108 సినిమా విషయాలు చెప్పండంటూ నెట్టింట ఫ్యాన్స్ కోరుతున్నారు. వారి ఆత్రుత నేపథ్యంలో సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి #NBK108 పోస్టర్ రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి అంటే కామెడీ చిత్రాలు తీస్తారన్న పేరుంది. ఆయన డైరెక్షన్లో F2, F3లు బంపర్ హిట్టు కొట్టాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బాలయ్యతో అనిల్ రావిపూడి అనగానే సినిమా కామెడీ నేపథ్యంలో ఉంటుందని ఫ్యాన్స్ ఊహించారు. కానీ వారి ఊహలకు అందని విధంగా మసాలా మాస్ సినిమానే అని చెప్పేందుకు ఈ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో బాలయ్య పవర్ ఫుల్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. కుర్తా లాంటి బ్లాక్ షర్ట్ వేసుకొని గ్రే కలర్ గడ్డంలో మెరిసిపోతున్నాడు. దీంతో ఈ సినిమా కూడా భారీ యాక్షన్ నేపథ్యంలోనే వస్తుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి పోస్టర్ పై ‘దిస్ టైం బియాండ్ యువర్ ఇమాజినేషన్’ అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ఈసారి మీ ఊహలకు కూడా అందను. అనే అర్థం వచ్చేలా దీనిని పెట్టినట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమాలోనూ బాలయ్య మాస్ హీరోగా కనిపిస్తాడని అనిల్ రావిపూడి ముందే హింట్ ఇచ్చారు.
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాలయ్య వరుస హిట్ల హీరోగా మారిపోయాడు. కుర్ర హీరోలకు పోటీనిస్తూ కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. ఆయన తరువాత సినిమా కూడా మాస్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. అంతేకాకుండా సినిమాపై అంచనాలు విపరీతంగా పెరుగుతుండడంతో మరోసారి బాలయ్య హిట్టు కొట్టి హ్యాట్రిక్ ఖాతాలో పడుతారా అని అనుకుంటున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బాలయ్యతో పాటు కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీలీల ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

పటాస్, సరిలేరు నీకెవ్వరు, F2, F3 సినిమాలతో అనిల్ రావిపూడి ఫేమస్ డైరెక్టర్ గా మారారు. దీంతో ఆయనతో సినిమా చేయడానికి బాలయ్య అడ్డు చెప్పలేదు. అయితే బాలకృష్ణ సినిమా అనగానే మసాలా మాస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. #NBK108 కు అనిల్ రావిపూడి డైరెక్టర్ అనగానే చాలా మంది ఈ సినిమా కామెడీ ప్రధానంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆయన రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తే ఇది భారీ యాక్షన్ మూవీనే అని అర్థమవుతోంది.
అనిల్ రావిపూడి మొదటిసారి బాలకృష్ణ తోనే మాస్ మూవీని ప్రయోగం చేస్తున్నాడు. ఒకవేళ ప్రయోగం ఫెయిల్ అయితే ఫ్యాన్స్ నుంచి విమర్శలు తప్పవు.కానీ బాలకృష్ణ కోసం అనిల్ ముందే కథను సిద్ధం చేసుకున్నాడట. బాలయ్యను ఎలా చూపించాలో మైండ్లో ఫిక్సయ్యాడట. మరి ఆయన చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతుందా? బాలయ్యకు హ్యాట్రిక్ కు అవకాశం ఇస్తారా? అన్న చర్చ సాగుతోంది.