Viral Video: సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి.. ఆ ఛానల్ అసలు కథ బయటపడింది. జనాలను మోసం చేస్తున్న వ్యవహారం.. మాయ చేస్తున్న విధానం తెరపైకి వచ్చింది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఓ యూట్యూబ్ ఛానల్లో ఓ యాంకర్ స్కిన్ డాక్టర్ ను ఇంటర్వ్యూ చేస్తుంది. అందులో చర్మం ఎలా తెల్లగా మారాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మం తెల్లగా ఎలా అవుతుంది.. అనే ప్రశ్నలను ఆ యాంకర్ అడిగింది. దానికి ఆ స్కిన్ డాక్టర్ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ” ప్రతిరోజు నా క్లినిక్ వద్దకు రకరకాల చర్మ సమస్యలతో బాధపడేవారు వస్తుంటారు.. వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తుంటారు. వైద్య చికిత్సలు చేసి చర్మం గ్రూపు మార్చుతాను.. తద్వారా వారి స్కిన్ తెల్లగా అవుతుంది. అందువల్లే రోజూ నా దగ్గరికి వందలాది మంది పేషెంట్లు వస్తుంటారని” ఆ స్కిన్ డాక్టర్ వ్యాఖ్యానించింది.
ఆమెనే ఈమె
ఆ వీడియోలో స్కిన్ డాక్టర్ గా కనిపించిన మహిళ.. డాక్టర్ కాదు. ఆమె అదే యూట్యూబ్ ఛానల్లో యాంకర్ గా పని చేస్తోంది. గతంలో నాటు కోళ్ల పెంపకంపై ఓ వీడియో చేసింది. ఆ వీడియోను.. ప్రస్తుతం ఆమె స్కిన్ డాక్టర్ గా మారిన వీడియోకు జత చేసి ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ” ఇది వీరి అసలు రూపం. డాక్టర్లు వాళ్లే.. యాంకర్లు కూడా వాళ్లే.. జనాలను విజయవంతంగా మోసం చేసే ప్రక్రియ ఇది. దర్జాగా మాయ చేసే పన్నాగం ఇది. అందువల్లే జనాలు సులభంగా మోసపోతున్నారు. వారి మాయలో చిక్కుకుపోతున్నారు. వ్యూస్ కోసం.. అడ్డగోలు సంపాదన కోసం.. దారుణాతి దారుణమైన వీడియోలను ఇలాంటి యూట్యూబ్ చానల్స్ చేస్తున్నాయి.. వీటికి సెన్సార్ ఉంటే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు అలాంటి పని జరగడం లేదు. ఇప్పటికైనా కేంద్రం ఇలాంటి ఫేక్ వీడియోలు చేసే యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో జనాలు ఇంకా మోసపోయే ప్రమాదం ఉందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “వెనుకటి కాలంలో మాయలు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. మోసాలు చేసే వాళ్ళు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను యూట్యూబ్ ఛానల్స్ ఎత్తుకున్నాయి. అందువల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. డబ్బుల కోసం ఎంతటి దుర్మార్గాల కైనా పాల్పడుతుంటాయి. ఆ చానల్స్ అసలు రూపం తెలియక చాలామంది అందులో వచ్చినవి నిజాలని నమ్ముతుంటారు. కానీ అందులో అసలు వాస్తవం ఇదీ” అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.. సోషల్ మీడియాలో..!!
చూస్కోవాలి కదా..!??
@SumanTVTelugu @SumanTvOfficial pic.twitter.com/OraxKCzOjr— Shakeel ™ (@Shakeel_Here_) January 1, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Not a skin doctor but an anchor on a youtube channel
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com