North Carolina: కూతురు అంటే ఏ తండ్రికైనా ఆకాశమంత ప్రేమ. ప్రతీ తండ్రి కూతురును అమితంగా ప్రేమిస్తారు. గౌరవిస్తాడు. తల్లిగా, చెల్లిగా, బిడ్డగా కూతురు మాటలకు విలువ ఇస్తాడు. కూతురు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు. కూతురుకు ఏమన్న అయితే తండ్రి హృదయం తల్లడిల్లుతుంది. ఆపదలో ఉంటే తన ప్రాణాలు అడ్డువేసైనా కూతురు బతకాలని భావించేది ఒక్క తండ్రి మాత్రమే. అంతలా కూతురు కోసం సర్వం ధారపోసేది తండ్రే. సృష్టిలో తల్లికి ఎంత విలువ ఉందో.. తండ్రికి అంతే విలువ ఉంది. కానీ, తల్లి ప్రేమ బయటకు కనిపిస్తుంది. తండ్రి ప్రేమ గుండెల్లో ఉంటుంది. తండ్రి తన ప్రేమను బయటకు కనిపించనివ్వడం. కానీ అవసరమైనప్పుడు మాత్రమే దానిని వెలిబుచుత్తాడు. కోపగించుకున్నా.. అది కూడా కూతురుపై ప్రేమతోనే. కూతురు బాగు కోసమే. ఇది అంత త్వరగా అర్థం కాదు. తాజాగా కూతురుపై ఉన్న ప్రేమతో ఓ తండ్రి ప్రాణాలకు తెగించాడు. కూతురుకన్నా తనకు తన ప్రాణం కూడా తనకు ఎక్కువ కాదని భావించాడు. కూతురు పెళ్లి చూడాలని వృద్ధాప్యంలో 12 గంటల్లో 51 కిలోమీటరుల నడిచాడు.
పెను తుపానులో..
అమెరికాలో ఇటీవల హెలెస్ హరికేన్ విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలకు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. విమానాశ్రయాలు మూతపడ్డాయి. రోడ్లు, రైలు మార్గాలు కొట్టుకుపోయాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమై అంధకారం అలుముకుంది. ఇదే సమయంలో అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జోన్స్ కూతురు ఎలిజిబెత్ పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి సమీపిస్తున్నా.. తుపాను తగ్గలేదు. అప్పటికే కూతురు, బంధువులు పెళ్లి జరిగే జాన్సన్ సిటీకి చేరుకున్నారు. జోన్‌స మాత్రమే నార్త్ కరోలినాలో చిక్కుకుపోయారు. కూతురు పెళ్లి చూడడం ఎలా అన్న ఆందోళన జోన్స్‌లో పెరిగింది. కూతురు పెళ్లి చూడలేకపోతానేమో అని భయపడ్డాడు.
12 గంటల్లో 51 కిలో మీటర్ల నడక..
హరికేన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ సమయంలో జోన్స్ కూతురు పెళ్లి ఎలాగైనా చూడాలని గట్టిగా అనుకున్నాడు. అనుకున్నతే తడవుగా 50 ఏళ్ల పైగా వయస్ను అతను కాలి నడకన 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్సన్ సిటీకి బయల్దేరాడు. ఒకవైపు జోరు వాన.. అస్తవ్యస్తమైన ట్రాఫిక్.. ముంచెత్తుతున్న వరదలు. తన కూతురుపై ఉన్న ప్రేమ ముందు ఇవన్నీ చిన్నబోయాయి. వీటిని అధికగమించుకుంటూ కేవలం 12 గంటల్లోనే జోన్స్.. కూతురు పెళ్లి జరిగే జాన్సన్ సిటీకి చేరుకున్నాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న కూతురును చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. పెళ్లి అయ్యాక.. తాను చేసిన సాహసం గురించి బిడ్డకు చెప్పాడు. తనపై ప్రేమతో తండ్రి చేసిన సాహసం తెలుసుకుని పెళ్లికూతురు ఎలిజిబెత్ కూడా కన్నీరు పెట్టుకుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: North carolina father walked 51 kilometers in about 12 hours for his daughter wedding
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com