Mohan Babu: ఎంత చెట్టుకు అంత గాలి. ఆ గాలి సవ్య దిశలో వీచినప్పుడు మాత్రమే.. అందులో ఏమాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. మనిషి జీవితానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ సూత్రం కట్టు తప్పింది.. మోహన్ బాబు జీవితం తలకిందులైంది. పేరున్న నటుడైనప్పటికీ, నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ ఏవీ ఆయనను ఆదుకోలేదు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు అయినవారు తోడ్పాటు అందించలేదు.
అప్పట్లో మోహన్ బాబు సాక్షి శివానంద్ తో కలిసి యమజాతకుడు అనే సినిమా తీశారు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా చతికిల పడింది. మోహన్ బాబుకు భారీగా నష్టాలను తీసుకువచ్చింది. దీంతో అప్పులు ఇచ్చిన ఫైనాన్షియర్లు మోహన్ బాబు మీద ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఎన్నో రకాల ప్రయత్నం చేసినప్పటికీ మోహన్ బాబుకు డబ్బు సర్దుబాటు కాలేదు. దీంతో గత్యంతరం లేక మోహన్ బాబు హైదరాబాదులోని బంజారాహిల్స్ లో తన ఇల్లును అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ వచ్చిన డబ్బుతో ఫైనాన్షియర్ల అప్పులు కట్టేశారు.
కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా మోహన్ బాబు నిర్మాణ సంస్థలు సరైన హిట్లు పడలేదు. అప్పట్లో పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్, శ్రీ రాములయ్య, రాయలసీమ రామన్న చౌదరి తర్వాత ఆ స్థాయిలో ఏ సినిమాలు కూడా హిట్లు కాలేదు.. మొన్నామధ్య మోహన్ బాబు బ్యానర్ లో తీసిన సన్ ఆఫ్ ఇండియా, జిన్నా సినిమాలు అడ్డంగా తన్నేసాయి.
ఇక 1970లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు ప్రతి నాయకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించాడు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం. సినిమాల్లోకి వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు ఆయన పేరుని మోహన్ బాబు గా మార్చాడు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన స్వర్గం నరకం సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మెప్పించాడు. దశాబ్దాల సెమీ ప్రస్థానంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగారు మోహన్. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏరియల్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.
మేజర్ చంద్రకాంత్, పెద రాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న లాంటి సినిమాలు మోహన్ బాబు స్థాయిని మరింత పెంచాయి. ఇటు విద్యా రంగంలోనూ మోహన్ బాబు విజయవంతమయ్యారు. శ్రీ విద్యానికేతన్ సంస్థల అధిపతిగా కొనసాగుతున్నారు. మార్చి 19న మోహన్ బాబు 71 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. తన జీవితంలో పడిన కష్టాలను, సినీ ప్రయాణంలో ఎదురైన చేదు ఘటనలను గుర్తు చేసుకున్నారు.. తను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు.. సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పోగొట్టుకున్నానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.