Nirmal District Lokeswaram Mandal Atrocious: ఆవును పవిత్ర దేవతగా పూజిస్తారు. దానికి పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. హిందువులకు పవిత్ర జంతువుగా ఆవుకు పేరుంది. దీంతో ఆవును అపర దేవతగా కొలుస్తారు. దాని పృష్ట భాగం ఎంతో పవిత్రమైనదిగా నమ్ముతారు. కానీ ఇక్కడ ఓ మృగాడు దాని పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేశాడు. మనిషిలో కూడా రాక్షసుడు ఉన్నాడని నిరూపించాడు. ఆవును పవిత్రంగా చూసుకోవాల్సిన వాడే జుగుస్సాకరంగా ప్రవర్తించి అతడు మానవత్వానికే మచ్చ తెచ్చాడు.

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు ఆవుపైనే అఘాయిత్యానికే దిగాడు. అర్థరాత్రి వేళలో ఆవుపై సంభోగానికి ఉపక్రమించి దాని చావుకు కారణమయ్యాడు. పెనుగులాటలో ఆవు మెడకు కట్టేసిన తాడే ఉరితాడు కావడంతో ప్రాణాలొదిలింది. మూగ జీవిపై ప్రతాపం చూపిన మూర్ఖుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి.
Also Read: Telangana Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ సుముఖమేనా?
గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన విజయ్ అనే యువకుడు టైల్స్ వేయడానికి వచ్చాడు. అర్థరాత్రి సమయంలో బాగా మద్యం తాగి కట్టేసిన ఆవుపై అత్యాచారం చేయాలని భావించి లోపలికి తీసుకొచ్చి కిటికీకి కట్టేసి లైంగిక దాడికి ఉపక్రమించాడు. దీంతో ఆవు పెనుగులాడింది. దానికి కట్టిన తాడు మెడకు చుట్టుకుని మరణించింది. ఉదయం వేళ గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. పవిత్రమైన జంతువుపై దారుణానికి ఒడిగట్టిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్లు చేస్తున్నారు. ఆవుకు పోస్టుమార్టం నిర్వహించారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన ఉత్తరప్రదేశ్ కు చెందిన నిందితుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని హిందు సంఘాలు కోరుతున్నాయి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి.
Also Read: CM KCR: కేసీఆర్ లో టెన్షన్ మొదలైందా.. పర్‌ఫెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారా..?