Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే అమ్మాయి నిహారిక కొణిదెల. ఈమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అతికష్టం మీద జరిగింది. మెగా ఫ్యాన్స్ అసలు ఒప్పుకోలేదు. అయితే తన కల నెరవేర్చుకునేందుకు నిహారిక సాహసం చేసింది. విమర్శల నడుమ హీరోయిన్ అవతారం ఎత్తింది. నిహారిక మొదటి చిత్రం ఒక మనసు. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. నిహారిక నటనకు ప్రశంసలు దక్కాయి. నాగ శౌర్య హీరోగా నటించిన ఒక మనసు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే కమర్షియల్ గా ఆడలేదు. ట్రాజిక్ ఎండింగ్స్ తెలుగు ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. అది కూడా కారణం కావచ్చు. అనంతరం యూత్ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించింది. సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాల్లో నిహారిక హీరోయిన్ నటించారు. కోలీవుడ్ లో కూడా చిత్రాలు చేసింది. అయితే నిహారికకు బ్రేక్ రాలేదు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డిలో నిహారిక గెస్ట్ రోల్ చేసింది.
2020 డిసెంబర్ లో నిహారిక పెద్దలు చూసిన సంబంధం వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే మనస్పర్థలతో వీరు ఈ ఏడాది విడిపోయారు. అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. విడాకులు అనంతరం నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టింది. డెడ్ ఫిక్సెల్స్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది. ఆన్లైన్ గేమ్ నేపథ్యంలో యూత్ఫుల్ డ్రామా తెరకెక్కింది.
హైదరాబాద్ లో సొంతగా ఆఫీస్ ఓపెన్ చేసింది. నిహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఓ బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ లో స్మాల్, మీడియా బడ్జెట్ చిత్రాలు, సిరీస్లు ప్లాన్ చేస్తుంది. ఇక హీరోయిన్ గా ఎదగాలని కోరుకుంటున్న నిహారిక గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఘాటైన ఫోజులతో కాకరేపుతుంది. నిహారిక లేటెస్ట్ ఫోటో షూట్ గుండెల్లో గుబులు రేపేలా ఉంది. గ్లామర్ ఇండస్ట్రీలో ఫోటో షూట్స్ తప్పనిసరి. నిహారిక అదే చేస్తుంది.