
Niharika Konidela – Chaitanya Divorce: గడిచిన పదేళ్లలో అంగరంగ వైభవంగా చరిత్ర లో నిలిచిపొయ్యే రేంజ్ లో జరిగిన పెళ్లిళ్ల లిస్ట్ తీస్తే అందులో నిహారిక కొణిదెల – చైతన్య వివాహం ముందు వరుస లో ఉంటుంది. మెగా బ్రదర్ నాగబాబు చరిత్రలో నిలిచిపొయ్యేలా రాజస్థాన్ లోని ఉదయగడ్ ప్యాలస్ లో వీళ్లిద్దరి వివాహం ని జరిపించారు. సోషల్ మీడియా లో ఒక్కసారి #Nischay అనే ట్యాగ్ క్లిక్ చేస్తే వీళ్ళ పెళ్లి సంబరం కనిపిస్తుంది.
మెగా కుటుంబం లోని అనందం మొత్తం కనిపిస్తుంది. అంత అంగరంగ వైభవంగా వీళ్లిద్దరి వివాహం జరిపిస్తే ఇప్పుడు వీళ్ళు విడిపోయారు అనే వార్త మెగా ఫ్యాన్స్ కి హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది. ఎందుకంటే మేడ్ ఫార్ ఈచ్ అథర్ లాగ అనిపిస్తుంది ఈ జంట. గత కొంత కాలం లో విడివిడిగానే ఉంటూ వచ్చిన ఈ జంట లేటెస్ట్ గానే కోర్టు లో విడాకుల పిటిషన్ ని దాఖా చేశారట.
ఇంస్టాగ్రామ్ ఇద్దరు ఒకరిని ఒకరు అన్ ఫాలో కొట్టేసారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేసారు.అప్పుడెప్పుడో అప్లోడ్ చేసిన పెళ్లి ఫోటోలను కూడా తొలగించేసారు.ఇదంతా చూసి మెగా ఫ్యాన్స్ తలలు బాదుకుంటున్నారు. గత ఏడాది నిహారిక కొణిదెల ఒక పబ్ లో పోలీసులు రైడింగ్ చేసినప్పుడు దొరికిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడుతూనే ఉన్నాయి.ఫలితంగా ఈరోజు ఇలా అయ్యింది.

మొన్నీమధ్యనే చిరంజీవి రెండవ కూతురు తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసింది అంటూ వార్తలు వచ్చాయి.ఇంతలోపే నిహారిక కూడా విడాకులు తీసుకుంది అనే వార్త రావడం తో మెగా ఫ్యాన్స్ డీలా పడ్డారు. రామ్ చరణ్ కి ఈ ఏడాది బిడ్డ పుట్టబోతున్నాడు అనే శుభ వార్త మూడ్ లో ఎంజాయ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ , ఒక్కసారిగా ఈ వార్త వినడం తో కుప్పకూలిపోయారు.