https://oktelugu.com/

Niharika: మెగా డాటర్ నిహారికకు ఏమైంది? పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం

Niharika: పెద్దింటి ఆడబిడ్డ అయిన మెగా డాటర్ నిహారిక పెళ్లి అయ్యాక కాస్త సినిమాలకు దూరమైంది. ఇక షార్ట్ ఫిలిం, ఓటీటీల నుంచి కూడా మాయమై కేవలం నిర్మాతగానే ఉంటూ వస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లోని పబ్ లో ఆమె ఉండడంతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆరోపణలు వచ్చాయి. కానీ వీటిని మెగా బ్రదర్ నాగబాబు సహా వారి కుటుంబం ఖండించింది. ఇక చైతన్యను పెళ్లి చేసుకున్నాక నిహారిక భర్తతోనే ఉంటూ హౌస్ వైఫ్ గానే […]

Written By:
  • NARESH
  • , Updated On : May 2, 2022 / 06:18 PM IST
    Follow us on

    Niharika: పెద్దింటి ఆడబిడ్డ అయిన మెగా డాటర్ నిహారిక పెళ్లి అయ్యాక కాస్త సినిమాలకు దూరమైంది. ఇక షార్ట్ ఫిలిం, ఓటీటీల నుంచి కూడా మాయమై కేవలం నిర్మాతగానే ఉంటూ వస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లోని పబ్ లో ఆమె ఉండడంతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆరోపణలు వచ్చాయి. కానీ వీటిని మెగా బ్రదర్ నాగబాబు సహా వారి కుటుంబం ఖండించింది.

    Niharika

    ఇక చైతన్యను పెళ్లి చేసుకున్నాక నిహారిక భర్తతోనే ఉంటూ హౌస్ వైఫ్ గానే కాలం వెళ్లదీస్తోంది. వీళ్లద్దరూ ఒకే అపార్ట్ మెంట్ లో తల్లిదండ్రులకు దూరంగా ఏకాంతంగా కలిసి ఉంటున్నట్టు తెలిసింది. అయితే ఈ అన్యోన్యత కొనసాగిస్తూనే మెగా డాటర్ నిహారిక తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

    Also Read: KA Paul Attack: ద్యావుడా… కేఏ పాల్ చెంప పగులకొట్టారే!

    ఇప్పటికే పెళ్లి తర్వాత సమంత నటిస్తూ ముందుకు సాగింది. కొన్ని శృంగార భరిత పాత్రలు చేసింది. అది అంతిమంగా నాగచైతన్యతో విడాకులకు దారితీసింది. తాజాగా నిహారిక పెళ్లి తర్వాత కూడా మళ్లీ నటించేందుకు సిద్ధమైందట.. ఈమేరకు ఆమె తండ్రి నాగబాబు కుటుంబం కూడా దీనికి ఓకే చెప్పిందట.. ఇక భర్త చైతన్య మద్దతు కూడా నిహారికకు ఉందని వివరించింది.

    Niharika

    ఈ క్రమంలోనే మరోసారి నిహారిక ముఖ్యమైన పాత్రల్లో నటించేందుకు రెడీ అయ్యిందట.. చిరంజీవి, పవన్, అన్నయ్య వరుణ్ తేజ్, రాంచరణ్ సహా మెగా హీరోలు ఇతర అగ్రహీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కీలక పాత్రలు దొరికితే అందులో నటించడానికి రెడీ అంటోంది.

    పెళ్లి తర్వాత నటన అంటే రిస్క్ నే. ఇదివరకు చేసిన నటీనటుల జీవితాలు కాస్తా గాడితప్పాయి. ఈ విషయంలో మెగాడాటర్ ధైర్యంగా ముందుకెళుతోంది. తల్లిదండ్రులతో మద్దతుతో తన కెరీర్ లో రాణించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది వేచిచూడాలి.

    Also Read: KTR- AP TDP Leaders: కేటీఆర్ పై గురిపెట్టి వైసీపీని కాలుస్తున్న టీడీపీ..

    Recommended Videos: