Neeraj Chopra – Manu bhakar : నీరజ్ చోప్రా – మను భాకర్ గుసగుసలు.. ముసి ముసి నవ్వులు.. పారిస్ ఒలింపిక్స్ లో ఇంత కథ నడిచిందా?

నీరజ్ - మను భాకర్ ప్రేమలో ఉన్నారని.. ఆమెను అతడు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఇంకా కొన్ని మీడియా సంస్థలు అయితే మను భాకర్ ను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి నీరజ్ చోప్రాను కోరారని కథనాలు ప్రసారం చేశాయి. అయితే దీనిపై అటు నీరజ్, ఇటు మను భాకర్ నోరు మెదపలేదు.

Written By: NARESH, Updated On : ఆగస్ట్ 13, 2024 3:36 సా.

Neeraj Chopra - Manu Bhakar

Follow us on

Neeraj Chopra – Manu bhakar : పారిస్ .. ప్రేమకు, ఫ్యాషన్ కు క్యాపిటల్ సిటీ. అలాంటి ఈ ప్రాంతంలో ఈసారి ఒలింపిక్స్ జరిగాయి. ప్రపంచంలోనే వివిధ దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ లతో పారిస్ నగరం కిటకిటలాడిపోయింది. ఈసారి క్రీడలకు కూడా పారిస్ ఒలంపిక్ కమిటీ కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాటు చేసింది. ఈసారి జరిగిన ఒలంపిక్స్ లో మెడల్స్ జాబితాలో అమెరికా, చైనా దేశాలు తొలి రెండు స్థానాల్లో గెలిచాయి. భారత్ కేవలం 6 మెడల్స్ తో 71 వ స్థానంలో నిలిచింది. ఏడు అంశాలలో భారత అథ్లెట్లు నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో భారత్ ఏడు మెడల్స్ కోల్పోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆ మెడల్స్ కనుక వచ్చి ఉంటే భారత్ డబుల్ మార్క్ సాధించి, సరికొత్త చరిత్ర సృష్టించి ఉండేది..

ఇక ఈసారి జరిగిన ఒలింపిక్స్ లో భారత్ తరఫున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మను భాకర్ -నీరజ్ చోప్రా. మను భాకర్ షూటింగ్ విభాగంలో రెండు మెడల్స్ సాధించి సత్తా చాటింది. హ్యాట్రిక్ ను వెంట్రుక వాసిలో కోల్పోయింది. మరోవైపు జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా స్వల్ప తేడాతో స్వర్ణం మిస్సయ్యాడు. టోక్యోలో స్వర్ణం సాధించిన అతడు, పారిస్ లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే ఈ ఇద్దరు అథ్లెట్లు ఈసారి పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో భారత దేశ పరువును కాపాడారు. అయితే సోమవారం మను భాకర్- నీరజ్ చోప్రా పారిస్ లో సన్నిహితంగా కనిపించారు. వారిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతుండగా.. మీడియా ప్రతినిధుల కెమెరాలు మొత్తం అటువైపు మళ్లాయి .. వారిద్దరు సిగ్గు పడుకుంటూ సంభాషణలు సాగించారు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపించింది. ఇదే సమయంలో మను భాకర్ తల్లి నీరజ్ తో మాట్లాడింది. చోప్రా తలపై చేతితో నిమిరి, వాగ్దానం తీసుకుంది. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి.

నీరజ్ – మను భాకర్ ప్రేమలో ఉన్నారని.. ఆమెను అతడు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఇంకా కొన్ని మీడియా సంస్థలు అయితే మను భాకర్ ను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి నీరజ్ చోప్రాను కోరారని కథనాలు ప్రసారం చేశాయి. అయితే దీనిపై అటు నీరజ్, ఇటు మను భాకర్ నోరు మెదపలేదు. గజ్జల్లో గాయం కావడంతో శస్త్ర చికిత్స కోసం నీరజ్ చోప్రా జర్మనీ వెళ్లిపోయాడు. శస్త్ర చికిత్స జరిగిన తర్వాత అతడు ఒక నెలపాటు అక్కడే ఉంటాడు. గత ఒలింపిక్స్ లో నీరజ్ స్వర్ణం గెలిచాడు. పారిస్ ఒలంపిక్స్ లో రజతం సాధించాడు. మను భాకర్ షూటింగ్ విభాగంలో సత్తా చాటింది. పది మీటర్ల పిస్టల్ లో రెండు కాంస్య పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో ఒక మెడల్, మిక్స్ డ్ విభాగంలో సరబ్ జ్యోత్ తో కలిసి మరొక మెడల్ సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.