
England vs New Zealand Test 2023: న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా ఇచ్చింది. టీ20 ల్లో మునిగి పోయిన అభిమానులకు సిసలైన కేక్ ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి, సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ ని 1_1తో న్యూజిలాండ్ సమం చేసింది. ఫాలో ఆన్ ఆడి విజయం సాధించి వారేవా అనిపించింది. వెల్డింగ్టన్ వేదిక గా జరిగిన రెండో టెస్టులో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 209 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. తర్వాత న్యూజిలాండ్ జట్టును బ్యాటింగ్ ఆహ్వానించిన ఇంగ్లాండ్.. అది ఎంత తప్పుడు నిర్ణయం తర్వాత గాని అర్థం కాలేదు. మొదటి ఇన్నింగ్స్ లో విఫలమైన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్.. రెండో ఇన్నింగ్స్ లో దుమ్మురేపారు. ఏకంగా 483 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ ముందు 258 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు.
న్యూజిలాండ్ బౌలర్లు దుమ్మురేపారు
258 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు.. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి వణికి పోయింది. జో రూట్ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ నిలబడలేకపోయారు. ఓపెనర్లు జాక్ కార్వ్లే(24),బెన్ డక్లేట్(33) పరుగులు చేశారు. ఈ జోడి కుదురుకుంటుంది అనే సమయానికి సౌథి అద్భుతమైన బంతికి కార్వ్లే ను క్లీన్ బౌల్డ్ చేశాడు.. ఇదే క్రమంలో డక్లేట్ ను మ్యాట్ హెన్రీ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన రాబిన్ సన్ సౌథి బౌలింగ్ లో బ్రేస్ వెల్ కు క్యాచ్ ఇచ్చి ఆటయ్యాడు. జో రూట్ మాత్రమే న్యూజిలాండ్ బౌలర్లకు ఎదురు నిలబడగలిగాడు. 95 పరుగులు చేసిన ఇతడు.. వాగ్ నర్ బౌలింగ్లో బ్రేస్ వెల్ కు క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు..
ఎప్పుడైతే జో రూట్ ఔట్ అయ్యాడో.. అప్పటినుంచి న్యూజిలాండ్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.. ఇది సమయంలో హారిబ్రూక్ రన్ అవుట్ కావడం న్యూజిలాండ్ జట్టుకు మరింత కలిసి వచ్చింది. బెన్ స్టో క్స్ కూడా 33 పరుగులు మాత్రమే చేసి వాగనర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇదే సమయంలో బెన్ ఫోక్స్ కూడా భారీ స్కోరు సాధించక్రమంలో 35 పరుగుల వద్ద సౌథి బౌలింగ్లో వాగ్ నర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టువర్టు బ్రాడ్, అండర్సన్ త్వర త్వరగా నే ఔట్ అయ్యారు. ఫలితంగా న్యూజిలాండ్ ఒక్క పరుగుతో విజయం సాధించింది.

ఇక ఈ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ గెలుపు భారాన్ని మొత్తం సౌథి, వాగ్ నర్ మోశారు. వీరిద్దరికీ హెన్రీ తోడయ్యాడు.. వాస్తవానికి 80 పరుగులకే ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన కీలక అయిదు వికెట్లు తీశారు అంటే వారు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే బెన్ స్టోక్స్, జో రోట్ ఆరో వికెట్ కు 121 పరుగులు జోడించారు. ఒక దశలో ఇంగ్లాండ్ గెలుపు దిశగా సాగుతోంది అనే క్రమంలో.. 33 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ ఉండగా, అతడిని వాగ్ నర్ ఔట్ చేసి న్యూజిలాండ్ శిబిరంలో మళ్లీ అసలు రేపాడు. అయితే అప్పటికి జో రూట్ క్రీజు లోనే ఉన్నాడు. ఇదే క్రమంలో ఒక్క పరుగు తేడాతో జో రూట్ వికెట్ ను వాగ్ నర్ తీయడంతో న్యూజిలాండ్ శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లను కొద్దిసేపు బెన్ ఫోక్స్,స్టువర్ట్ బ్రాడ్ ఇబ్బంది పెట్టినప్పటికీ అది ఎంతో సేపు నిలవలేదు. సౌథి అద్భుతమైన బంతికి బెన్ ఫోక్స్ ఔట్ కాగా, బ్రాడ్ ను హెన్రీ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన జేమ్స్ అండర్సన్ వాగ్ నర్ అవుట్ చేశాడు.. న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అంతకుముందు జరిగిన తొలి ఇన్నింగ్స్ లో రూట్, బ్రూక్ సెంచరీలతో కదం తొక్కారు.. ఫాలో ఆన్ ఆడినప్పటికీ మొక్కవోని దీక్షతో న్యూజిలాండ్ విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక్క పరుగు తేడాతో గెలిచిన రెండో జట్టుగా నిలిచింది. ఫాలో ఆన్ ఆడి గెలిచిన మూడో జట్టుగా రికార్డు సృష్టించింది.