https://oktelugu.com/

IHU Variant: ప్రపంచంపైకి కొత్త మహమ్మారి.. ఒమిక్రాన్ కంటే ఎక్కువ డేంజర్

IHU Variant: చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా తన రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ప్రపంచంపైకి మరో కొత్త మహమ్మారిగా రాబోతోంది. ఇది ఇటీవలే దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన ‘ఒమిక్రాన్’ కంటే చాలా డేంజర్ అని తేలింది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో ప్రపంచదేశాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. భారత్ లో వెలుగుచూసిన డెల్టాతో పోలిస్తే విస్తృత వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. యూరప్, అమెరికాలో ఆందోళన కర స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2022 / 07:50 PM IST
    Follow us on

    IHU Variant: చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా తన రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ప్రపంచంపైకి మరో కొత్త మహమ్మారిగా రాబోతోంది. ఇది ఇటీవలే దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన ‘ఒమిక్రాన్’ కంటే చాలా డేంజర్ అని తేలింది.

    ihu varient

    ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో ప్రపంచదేశాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. భారత్ లో వెలుగుచూసిన డెల్టాతో పోలిస్తే విస్తృత వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. యూరప్, అమెరికాలో ఆందోళన కర స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు చాలా దేశాలు మరోసారి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఒమిక్రాన్ కార్చిచ్చులా చెలరేగుతున్న వేళ ప్రపంచానికి మరో ఉపద్రవం వచ్చి పడింది.

    ఒమిక్రాన్ కంటే ఎక్కువ మ్యూటేషన్లు కలిగిన ‘ఐహెచ్.యూ’ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపించిన యూరప్ దేశంలో ఈ కొత్త వేరియంట్ పురుడుపోసుకుంది. ఇప్పుడిది ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది.

    ఫ్రాన్స్ లో తాజాగా ‘ఐహెచ్.యూ’ అనే కొత్త కరోనా వేరియంట్ ను అక్కడి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో దాదాపు 46 మ్యూటేషన్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ 12 కేసులను తాజాగా ఫ్రాన్స్ లోని మార్సిల్లెస్ నగరంలో గుర్తించారు. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఈ కొత్త వేరియంట్ ను గుర్తించినట్టు తెలిసింది.

    కొత్త ‘ఐహెచ్.యూ’ వేరియంట్ లో 46 మ్యూటేషన్లు, 37 డిలీషన్లు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు గుర్తించినట్టు అమెరికన్ ఎపిడమాలిజస్ట్ సైతం గుర్తించారు. ఇలాంటివి ఇంకా పుట్టుకొస్తాయని.. అవన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

    ముఖ్యంగా ఈ కొత్త వేరియంట్ విస్తృతి, ఇమ్యూనిటీని తప్పించుకునే సామర్థ్యం ఉంటేనే ఒమిక్రాన్ మాదిరిగా ఆందోళనకర వేరియంట్ గా పరిగణిస్తామని అమెరికన్ సైంటిస్టులు చెబుతున్నారు.

    ఒమిక్రాన్ వల్ల ఇప్పటికే అమెరికా, యూరప్ అతలాకుతలం అవుతోంది. అమెరికాలో ఈ ఒక్కరోజే 10 లక్షల పాజిటివ్ కేసులు బయటపడడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ 130 దేశాలకు విస్తరించి భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ఫ్రాన్స్ లో బయటపడ్డ కొత్త వేరియంట్ ‘ఐహెచ్.యూ’ ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తుందోనన్న భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి.