Tamil Nadu Bride: యువతి ఉద్యోగం చేస్తోంది. ప్రతీరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకుంటున్నది. యువతి వయసు 18 ఏళ్లు. 10 రోజుల క్రితం యువతికి ఆమె మేనమామతో వివాహం అయ్యింది. 10 రోజుల తరువాత యువతి మళ్లీ ఉద్యోగానికి చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా ఆమె ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఉదయం వరకు యువతి కోసం గాలించిన కుటుంబ సభ్యులు కూతురు కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. 10 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న యువతి మరో యువకుడిని మళ్లీ పెళ్లి చేసుకుందని వెలుగుచూడటంతో హడలిపోయారు. పోలీసుల విచారణలో సినిమా ట్విస్టులను మించి లవ్ స్టోరీ బయటకు వచ్చింది.

మేనమామతో పెళ్లి..
తమిళనాడులోని వేలూరు జిల్లా పల్లికొండ పక్కనే ఉన్న ఒడియాత్తూరులోని పుదుమనైకి చెందిన 18 ఏళ్ల యువతి అదే ప్రాంతంలోని ఓ జ్యూస్ దుకాణంలో పనిచేస్తోంది. ప్రతీరోజు ఆయువతి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. 10 రోజుల క్రితం ఆ యువతికి, ఆమె మేనమామతో వివాహమైందని. కుటుంబ సభ్యుల సమక్షంలో మేనమామను పెళ్లి చేసుకున్న యువతి ఆమె భర్తతో హ్యాపీగా కాపురం చేసింది.
పది రోజుల తర్వాత జంప్..
పెళ్లి చేసుకున్న 10 రోజుల తరువాత ఆ యువతి జ్యూస్ దుకాణంలో పని చెయ్యడానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పల్లికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాయం అయిన యువతి తరచూ గోకుల్((26)తో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిది ఒడియటూరు అని నిర్ధారించుకున్నారు. పల్లికొండ పెట్రోల్ బంకులో గోకుల్ పనిచేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. పిల్లల తండ్రితో గోకుల్‌కు ఇప్పటికే పెళ్లయిందని, అతనికి రెండేళ్ల కొడుకు ఉన్నాడని, ఇప్పుడు అతని భార్య ఆరు నెలల గర్భిణి కూడా. కొత్త పెళ్లికూతురితోపాటు గోకుల్ కూడా మాయం అయ్యాడని గుర్తించిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న గోకుల్‌కు రెండేళ్ల క్రితం జ్యూస్ షాప్‌లో పని చేస్తున్న అమ్మాయి పరిచయం అయ్యిందని పోలీసులకు తెలిసింది. పోలీసులు గోకుల్ భార్య నుంచి వివరాలు సేకరించారు. అయితే స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తున్న గోకుల్ అతని భార్యకు మాత్రం మ్యాటర్ తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రియురాలికి కూడా తనకు పెళ్లి అయిన విషయం దాచిపెట్టిన గోకుల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంతకాలం ఎంజాయ్ చేశాడు. ప్రేమికుడు గోకుల్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న యువతికి పెట్రోల్ బంకు పక్కనే ఉన్న జ్యూస్ షాపులో ఉద్యోగం రావడంతో ఇద్దరూ ఇంకా ఎక్కువ కలవడం మొదలుపెట్టారు.
పెళ్లి చేసుకుని ప్రియుడితో..
పెళ్లి చేసుకుని పది రోజుల తర్వాత ప్రియుడితో వెళ్లిపోయిన యువతికి గోకుల్‌కు పెళ్లయిన విషయం తెలసింది. దీంతో అతనితో గొడవపడింది. ఇదే సమయంలో జ్యూస్‌షాప్‌లో పని చేస్తున్న యువతికి మేనమామను పెళ్లి అయిన విషయం తెలుసుకున్న గోకుల్ షాక్ అయ్యాడు. వెంటనే ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రేమికులు సిద్ధమయ్యారు. గర్భవతి అయిన భార్యను, రెండేళ్ల చిన్నారిని గోకుల్ వదిలేశాడు. కొత్త పెళ్లికూతురు భర్తను వదిలేసి ఇద్దరూ పారిపోయారు. ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేసిన కొత్త పెళ్లికూతురు గోకుల్‌ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. గుడిలో తనకు తాళి కట్టాలని కొత్త పెళ్లికూతురు చెప్పింది. ఇది విన్న గోకుల్ షాక్ అయ్యి నా భార్యకు విడాకులు తీసుకోకుండా తాళి ఎలా కట్టాలా అని ప్రియురాలిని ప్రశ్నించాడు. ఇప్పుడు నాకు తాళి కట్టకపోతే నేను జరిగిన విషయం మొత్తం లెటర్ రాస్తానని, అందులో నా చావుకి నువ్వే కారణం నువ్వే అని రాసిపెట్టి విషయం తాగి ఆత్మహత్య చేసుకుంటానని కొత్త పెళ్లికూతురు బెదిరించింది.

రెండు వారాల్లో రెండో పెళ్లి..
ప్రియురాలి బ్లాక్‌మెయిల్‌తో భయపడిన గోకుల్ 25వ తేదీన గుడియాతంలోని ఓ ఆలయంలో కొత్త పెళ్లికూతురు మెడలో తాళి కట్టాడు. అద్దెకు ఇల్లు తీసుకుని ఇద్దరూ కాపురం పెట్టారు. యువతి ఉన్న ఇంటిని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరిని పట్టుకున్నారు. తాళి విప్పి తల్లిదండ్రులతో వెళ్లాలని పోలీసులు యువతికి సూచించారు. నేను తాళి ఎలా తీయగలను, నేను గర్భవతిని గోకుల్‌ను పెళ్లి చేసుకున్న అని చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు. జబర్దస్త్ డ్రామాలు ఆడిన కొత్త పెళ్లికూతురు మ్యాటర్ తెలుసుకున్న గోకుల్ భార్య ఆమె బిడ్డను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె బిడ్డను కొత్త పెళ్లికూతురి పాదాల దగ్గర పెట్టి తన భర్తను అప్పగించాలని వేడుకుంది. తాను 6 నెలల గర్భవతిని అని తెలిపింది. కొత్త పెళ్లికూతురు కూడా తానూ గర్భవతినే అని సమాధానం చెప్పింది. పోలీసులు కొత్త పెళ్లికూతురికి వైద్యపరీక్షలు చేయించారు. అయితే ఆమె గర్భవతి కాదని తేలింది. పోలీసులు, కుటుంబ సభ్యులు బుద్దిమాటలు చెప్పి కొత్త పెళ్లికూతురికి కొన్నిగంటలు బ్రైన్ వాష్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. అయితే పెళ్లి జరిగిన 10 రోజులకే వేరేవాడితో లేచిపోయిన నా భార్యతో నేను కాపురం చెయ్యలేను అని ఆమె మేనమామ తేల్చి చెప్పడంతో కథ మళ్లీ అడ్డం తిరిగింది.