New-Born Baby Boy Dies :అప్పుడే పుట్టింది ఆ శిశువు.. ఆ అమ్మానాన్న 9 నెలల ఎదురుచూపులకు ఫలితం ఆ బాబు. ఎప్పుడెప్పుడు చూద్దామా? ఆ తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ నర్సు నిర్లక్ష్యంతో వారి కలలు కల్లలయ్యాయి. వారి ఇంటి విషాదం అలుముకుంది.. పొత్తళ్ల నుంచి నర్సు చేతుల్లోకి వచ్చిన ఆ శిశువు ఆమె నిర్లక్ష్యానికి అసువులు బాసింది.
ఈ నిర్లక్ష్యపు ప్రమాదంలో శిశువు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లక్నోలోని చిన్హాట్ తాలూకా మల్హౌర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు చేతుల్లోంచి జారి నేలపై పడడంతో అప్పుడే పుట్టిన నవజాత శిశువు మరణించాడు.
శిశువు తలకు బలమైన గాయం మరణానికి కారణమే పోస్ట్‌మార్టం నివేదిక నిర్ధారించింది. నర్సు, ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఏప్రిల్ 19న జరిగినప్పటికీ మంగళవారం కొందరు మీడియా ప్రతినిధులకు తెలియడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటన జరిగిన రోజున శిశువుకు పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు దర్యాప్తు అధికారి అభిషేక్ పాండే బుధవారం తెలిపారు. “ఏప్రిల్ 20న వచ్చిన పోస్ట్‌మార్టం నివేదికలో తలకు గాయం కారణంగా ఆ శిశువు మరణం సంభవించినట్లు తేలింది” అఅని ఆయన తెలిపారు.
Also Read: BJP Congress Attack: బీజేపీ, కాంగ్రెస్ అటాక్.. కేసీఆర్ నిర్ణయం ఎటు వైపు?
నిర్లక్ష్యం, పైగా బాధితులకు బెదిరింపు.. గాయపరచడం ద్వారా శిశువు మరణానికి కారణమైన ఒక నర్సు.. ఆసుపత్రిలోని ఇతర సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా ఆస్పత్రిపైగానీ, సిబ్బందిపైగానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు..
చనిపోయిన పాప తండ్రి జీవన్ రాజ్‌పుత్ చిన్‌హట్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత తన భార్య పూనమ్ తీవ్ర మానసిక క్షోభకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని రాజ్‌పుత్ తెలిపారు.
ఏప్రిల్ 19న తన భార్యకు ప్రసవ నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లానని, రాత్రి ప్రసవం అయ్యిందని రాజ్‌పుత్ చెప్పాడు. “బిడ్డ చనిపోయి పుట్టిందని నాకు చెప్పారు. అయితే నేను నా భార్యతో మాట్లాడినప్పుడు, ఆమె డెలివరీ నార్మల్‌గా అయ్యిందని, ఆమె బిడ్డను బతికి ఉండగానే చూశానని తెలిపింది. టవల్ లేకుండా శిశువును తన చేతుల్లోకి తీసుకొని ఒక నర్సు తీసుకెళ్లిందని తెలిపింది. నర్సు చేతి నుండి బిడ్డ జారిపడినప్పుడు. నా భార్య భయాందోళనకు గురై కేకలు వేయడం ప్రారంభించిందని.. నర్సు, ఇతర సిబ్బంది ఆమె నోరు నొక్కేశారని నోరు మూసుకోమని బెదిరించారు” అని ఆ మరణించిన శిశువు తండ్రి రాజ్‌పుత్ ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆసుపత్రి.. అలాంటి ఘటనేమీ జరగలేదని పేర్కొంది. మొత్తానికి నర్సు నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం బలైనట్టు అయ్యింది.
Also Read: Star Anchor Divorce: విడాకులు తీసుకోవడం చాలా తెలికైనా విషయం.. కానీ..!