Minister Roja: సినీ హీరోయిన్ గా అగ్రతారగా సుమారు దశాబ్దం పాటు కొనసాగిన హీరోయిన్స్ లో ఒకరు రోజా..తెలుగు, తమిళం మరియు మలయాళం బాషలలో ఈమె అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించి సూపర్ హిట్స్ అందుకున్న రోజా,ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది..ముందుగా తెలుగు దేశం పార్టీ నుండి నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన రోజా, ఆ తర్వాత వైసీపీ పార్టీ లో చేరి రెండు సార్లు MLA గా గెలుపొందింది.

ఇప్పుడు ఆమె టూరిజం మినిస్టర్ గా పనిచేస్తుంది..అయితే రోజా కి నోరు ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు..గతం లో ఆమె పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ గురించి చాలా అసహ్యం గా మాట్లాడుతుంది..ఇప్పుడు అలాంటిదే తన విషయం లో జరగడం తో నీతులు చెప్పేస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే మినిస్టర్ అయిన తర్వాత రోజా కి తన అన్నయ్య ముద్దుపెట్టడం పై సోషల్ మీడియా లో రకరకాల విమర్శలు వచ్చాయి..ఆయన ఎవరో తెలియక రోజా ని తెగ ట్రోల్ చేసారు టీడీపీ మరియు జనసేన పార్టీ కి సంబంధించిన అభిమానులు..’నేను మినిస్టర్ అయిన ఆనడం లో నా అన్నయ్య నాకు ముద్దుపెట్టడం పై టీడీపీ , జనసేన వాళ్ళు పెడార్థాలు తీస్తున్నారు..ప్రేమాభిమానాలు తెలియని నీచులు కాబట్టే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు’ అంటూ రోజా ఎమోషనల్ అయ్యింది.

దీనికి నెటిజెన్స్ సోషల్ మీడియా లో చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు..గతం లో రోజా పవన్ కళ్యాణ్ భార్యలపై నోరు జారి మాట్లాడిన మాటలను అప్లోడ్ చేసి,నువ్వు కూడా నీతులు చెప్తున్నావా అంటూ విమర్శిస్తున్నారు..’ఖర్మ ఎవరినీ వదిలిపెట్టడు..ఆరోజు నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ఇలా తిరిగి ఇచ్చాడు..ఇక నుండి అయినా నోరు అదుపులో పెట్టుకో..సింపతీ డ్రామాలు ఆడకు’ అంటూ రోజా ని తిడుతున్నారు.