Homeట్రెండింగ్ న్యూస్Smita Sabharwal: అసలే లూప్ లైన్ పోస్ట్..ఇవి నాటి కేసీఆర్ రోజులు కావు.. పాపం స్మితా...

Smita Sabharwal: అసలే లూప్ లైన్ పోస్ట్..ఇవి నాటి కేసీఆర్ రోజులు కావు.. పాపం స్మితా సబర్వాల్ కు ఎన్ని కష్టాలు..

Smita Sabharwal: “పౌర్ణమి నాడు వెన్నెల వెలుగును ఆస్వాదించాలి. అమావాస్యనాడు చిక్కటి చీకటిని కూడా ఎదుర్కోవాలి. పౌర్ణమి నాటి వెలుగును కళ్ళజూసిన వారికి చీకటి అంటే చెడ్డ చిరాకు. అందుకే అమావాస్యను వారు అసహ్యించుకుంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు పౌర్ణమిని కాస్త దూరం చేసి అమావాస్యను శాశ్వతంగా పరిచయం చేస్తాయి”. ఓ పర్షియన్ సామెతకు తెలుగు అనువాదం ఇది. ప్రస్తుతం ఇది తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు సరిగ్గా సరిపోతుంది. అసలే భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది.. చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయి. ఏదైనా జరిగితే గతంలో మాదిరి సపోర్ట్ ఇచ్చే కేసీఆర్ లేడు. అన్ని శాఖలను చక్కబెట్టేందుకు ఆమె పని చేస్తోంది సీఎంవోలో కాదు. అప్పట్లో గా హెలికాప్టర్లో చక్కర్లు కొట్టే అవకాశం లేదు. స్థూలంగా చెప్పాలంటే గత ప్రభ మాసిపోయింది. మసకబారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఎలాగూ లూప్ లైన్ పోస్టింగ్ కాబట్టి.. పెద్దగా పని కూడా లేదు. గతంలో లాగా రీల్స్ చేసుకుంటూ, ఫేస్ బుక్ లో పోస్టింగులు పెట్టుకుంటూ ఉంటే సరిపోయేది. కానీ ఖాళీగా ఉన్న చెయ్యి ఊరుకోదు కదా.. ట్విట్టర్లో దివ్యాంగులపై ఏదో తల తిక్కగా ట్వీట్ చేసింది. దీంతో నిన్నటి నుంచి ఆమె ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయింది.

విమర్శలు

ట్విట్టర్లో దివ్యాంగులను ప్రశ్నిస్తూ స్మిత ట్విట్ చేయడంతో.. నిన్నటి నుంచి అగ్గి రాజుకుంది. పలువురు ఆమెను సోషల్ మీడియా వేదికగా కడిగి పారేస్తున్నారు..” అందంగా ఉంటేనే ఐఏఎస్ అధికారి అవ్వాలా. పదేళ్లు సీఎం ఓలో అధికారిగా ఉండి ఎలాంటి దర్పం ప్రదర్శించావో అందరికీ తెలుసు. ఇప్పుడు దివ్యాంగులపై నానా విమర్శలు చేస్తున్నావ్. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా” అని దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు..” ఒక పని చేయాలంటే ముందు మానసికంగా సంసిద్ధత అవసరం. ఆ తర్వాత దానికి శరీరం సహకరించాలి. దురదృష్టవశాత్తూ ఈ భూమ్మీద చాలా మందికి శారీరక వైకల్యం ఉంది. అయినప్పటికీ వారు దానిని పట్టించుకోకుండా వారి వారి పనుల్లో నిమగ్నమవుతున్నారు. మరొకరి తోడు లేకుండానే తమ పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడావ్. నీలాంటి సీనియర్ ఐఏఎస్ అధికారికి ఇలాంటి వ్యాఖ్యలు తగ్గేవేనా” అంటూ సోషల్ మీడియాలో స్మితపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

సవాల్ చేసిన బాలలత

స్మితపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రముఖ సివిల్స్ కోచింగ్ ఫ్యాకల్టీ బాలలత సరికొత్త సవాల్ విసిరారు. ” నువ్వూ నేనూ ఇప్పుడు సివిల్స్ రాద్దాం. నువ్వు నీ పదవికి రాజీనామా చేయ్. దివ్యాంగులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశావు. అలాంటి వ్యాఖ్యలు చేయడం నీ స్థాయికి తగ్గవేనా? అందంగా ఉంటేనే ఐఏఎస్ అధికారి అవ్వాలా. జయపాల్ రెడ్డి రెండు కాలు లేకపోయినప్పటికీ అద్భుతంగా పనిచేశారు. మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. నువ్వు అయినట్టుగానే చాలామంది దివ్యాంగులు సివిల్ అధికారులు అయ్యారు. వారంతా కూడా తమ పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. మరి నువ్వు అన్నట్టుగా వారికి వైకల్యం అడ్డుగా ఉంటే ఆ స్థాయిలో ఎలా రాణించగలుగుతారని” బాలలత ప్రశ్నించారు. సివిల్స్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చేయాలని, అంతేతప్ప ఇలా అనవసరమైన వివాదాలలో తల దూర్చి అభాసు పాలు కావద్దని బాలలత హితవు పలికారు. దివ్యాంగులు తమకున్న శక్తి సామర్థ్యాల మేరకు రాణిస్తున్నారని, అలాంటి వారిని అవహేళన చేయడం స్మితా సబర్వాల్ మానుకోవాలని బాలలత పేర్కొన్నారు.

తలదించుకోవాల్సిన పరిస్థితి..

మరోవైపు స్మిత చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు కూడా స్పందిస్తున్నారు. ” ఈమెకు రాజ్యాంగం అంటే లెక్కలేదు. మనుషుల మీద గౌరవం లేదు. వైకల్యంతో బాధపడుతున్న వారిని గౌరవించాలనే సోయి లేదు. ఇలాంటివారు బ్యూరోక్రాట్లు గా ఎలా పని చేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటివారిని సమాజం ఎందుకు ఓన్ చేసుకోవాలో అవగతం కావడం లేదని” మాజీ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమాజం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్మితకు హితవు పలుకుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular