NDRF Daring Operation: వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. నదుల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాహసం చేశాయి. అర్థరాత్రి సమయంలో వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేశారు.
బియాస్ నదిలో చిక్కుకున్న ఆరుగురిని కాపాడేందుకు చాలా శ్రమించారు. అతి కష్టం మీద వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రాణాపాయం లేకుండా వారు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇచ్చాయి. అర్థరాత్రి చిమ్మ చీకటి. ఎటు చూసినా చీకటే. కానీ వారు మాత్రం బెదరలేదు. ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టారు.
ఓ వ్యక్తి కేబుల్ ను గట్టిగా పట్టుకోగా సిబ్బంది అతడిని లాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రతికూల వాతావరణం ఉన్నా ఎన్డీఆర్ఎఫ్ సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తోంది. వరదల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడిన వారిని అందరు కీర్తిస్తున్నారు.
మండి జిల్లాలోని నగ్ వయిన్ గ్రామ సమీపంలో బియాస్ నది ఉప్పొంగి ప్రవహించడంతో కొందరు అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించింది. అర్థరాత్రి రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని రక్షించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండేందుకు వారు చేసిన సాహసం ఎంతో మందిని సంతోషపెట్టింది.
#WATCH | Himachal Pradesh: In a late-night rescue operation, NDRF team rescued 6 people who were stranded in the Beas River near Nagwain village in Mandi district due to the rise in the water level of the river following incessant rainfall in the state.
(Visuals: NDRF) pic.twitter.com/RQMlHKnBUV
— ANI (@ANI) July 10, 2023