
Naveen Chandra: తెలుగులో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవీన్ చంద్ర అందరికి సుపరిచితమే. తెలుగులో అందాల రాక్షసితో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కర్ణాటకలో జన్మించిన నవీన్ చంద్ర పదేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నాడు. తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. నేను లోకల్, అరవింద సమేత వీర రాఘవలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం అరవింద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఇతడికి అభిమానులు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. దీంతో నెటిజన్లు కూడా నవీన్ చంద్రకు మంచి ఫాలోవర్స్ గా ఉంటున్నారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ కి ఊహించని షాక్ ఇచ్చిన అభిమాని..వైరల్ అవుతున్న వీడియో
పాప గురించి..
ఇటీవల నవీన్ చంద్ర ఓ విషయం బయటపెట్టాడు. తన భార్య గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అభిమానులు అతడికి కంగ్రాట్స్ చెబుతున్నారు. తన భార్య బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసిన అతడు తాను తండ్రి కాబోతున్నందుకు సంతోషంగా ఉందని చెబుతున్నాడు. తనకు ఓ వారసుడు రాబోతున్నాడని సోషల్ మీడియా లో తన కోరికను బయటపెట్టాడు. తనకు కలిగే పాపను ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటానోనని ఉత్సాహం వ్యక్తం చేస్తున్నాడు.
ఊహల ఊయల్లో..
నిన్ను నా చేతుల్లోకి తీసుకుని ఎప్పుడు ముద్దాడుతానో అని పుట్టబోయే బిడ్డ గురించి వివరిస్తున్నాడు. కొత్త దశ, కొత్త జీవితం, కొత్త ప్రయాణం ఇలా అన్ని తనకు ఎంతో గమ్మత్తుగా అనిపిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడు. తండ్రిని కాబోతున్న ఓర్మా ఐ లవ్ యూ అంటూ భార్యను ఉద్దేశించి మరో పోస్టు పెట్టాడు. దీంతో నవీన్ చంద్రకు అందరు కంగ్రాట్స్ చెబుతున్నారు. తండ్రి కాబోయే నవీన్ చంద్ర ఊహల్లో విహరిస్తున్నాడు. సంతోషం పట్టలేకపోతున్నాడు.

అభిమానానికి..
ప్రస్తుతం తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే హీరో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. భవిష్యత్ లో కూడా మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాడు. తెలుగు ప్రేక్షకులు అందిస్తున్న అభిమానానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తెలుగు వారి అభిమానానికి పులకించిపోతున్నాడు. ఒక మనిషిని అభిమానిస్తే ఇంత బాగా చూసుకుంటారా అని ఆశ్చర్యపోతున్నాడు. తెలుగు వారికి రుణపడి ఉంటానని తన మనసులోని మాట వెల్లడిస్తున్నాడు.