Nani- Pawan Kalyan: అడవి శేష్ హీరో గా నటించిన ‘హిట్ 2’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే..2020 వ సంవత్సరం లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన విశ్వక్ సేన్ ‘హిట్’ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ కి అమెరికా నుండి అనకాపల్లి వరుకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అడవి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది.

మరో పక్క ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించి న్యాచురల్ స్టార్ నాని మరో జాక్పాట్ అందుకున్నాడు..హీరో గా ఆయనకీ రీసెంట్ గా ఆశించిన స్థాయి సక్సెస్ లు లేకపోయినా..నిర్మాతగా మాత్రం హిట్ 2 ఆయనకీ మంచి కిక్ ని ఇచ్చింది..ఇకపోతే ఈ సినిమా ని కొంతమంది సినీ ప్రముఖులకు స్పెషల్ షోస్ వెయ్యబోతున్నారట..వారిలో ముందుగా పవన్ కళ్యాణ్ కి స్పెషల్ షో ఏర్పాటు చెయ్యబోతున్నట్టు సమాచారం.
అడవి శేష్ కి పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుండి ఎంతో అభిమానం..ఈ విషయాన్నీ ఆయన ఎన్నో సందర్భాలలో తెలిపారు కూడా..మేజర్ సినిమా విడుదల సమయం లో కూడా పవన్ కళ్యాణ్ అడవి శేష్ ని పొగుడుతూ, ఆయనకీ అభినందనలు తెలుపుతూ ఒక పెద్ద లేఖ రాసారు..దానికి అడవి శేష్ ఎంతో పొంగిపోయాడు..ఈసారి కూడా ‘హిట్ 2’ మూవీ ని చూడాల్సిందిగా అడవి శేష్ పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కోరుకున్నాడట..పవన్ కళ్యాణ్ కూడా అడవి శేష్ అడగగానే ఒప్పుకొని ఈ సినిమా స్పెషల్ షో చూడడానికి అంగీకరించాడట.

దీనితో ఆ చిత్ర నిర్మాత నాని పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో వెయ్యడానికి ఏర్పాట్లు చేస్తునట్టు సమాచారం..ప్రస్తుతం అటు రాజకీయాలు..ఇటు సినిమాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్, ఈ వారం లోనే ఈ సినిమాని వీక్షించబోతున్నట్టు తెలుస్తుంది..సినిమా చూసిన తర్వాత ఆయన మీడియా తో ప్రత్యేకంగా కూడా మాట్లాడే అవకాశం ఉందట.