National Film Awards: దేశంలో విడుదలైన అన్ని చిత్రాల్లో, అన్ని భాషల్లో కేంద్రం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో మన దక్షిణాది హీరో ‘సూర్య’ సత్తా చాటాడు. ఏకంగా అజయ్ దేవగణ్ తో కలిసి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పంచుకున్నారు. శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా సూర్య, అజయ్ దేవగణ్ లు ఈ అవార్డును ఇద్దరు పంచుకోనున్నారు.
జాతీయ ఉత్తమ చిత్రంగా ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా’ నిలిచింది. ఉత్తమ దర్శకుడుగా దివంగత సచ్చిదానందన్(అయ్యప్పనుమ్ కోషియం) ఎంపికయ్యారు.
జాతీయ ఉత్తమ నటుడిగా సూర్య ఎంపిక కావడం దక్షిణాది సినిమాకు దక్కిన గౌరవంగా ఇక్కడి వారు అభివర్ణిస్తున్నారు. తమిళంలో తీసిన సూరారైపోటు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లో నటనకు గాను సూర్య, ‘తానాజీ’ సినిమాలో నటనకు గాను ‘అజయ్ దేవ్ గణ్ లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.
ఇక ఉత్తమ నటిగా ఇదే సూరారైపోటు చిత్రంలో హీరోయిన్ గా నటించిన హీరోయిన ‘అపర్ణా బాలమురళి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలవడం విశేషం.
ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో ఎంట్రీలను ఆహ్వానించగా.. తమిళ సినిమా ఆకాశం నీ హద్దురాకు అవార్డుల పంట పండింది.
ఇక తెలుగులో ఉత్తమ చిత్రంగా ‘కలర్ ఫొటో’ నిలవడం విశేషం. నవ హీరో, హీరోయిన్లు చేసిన ఈ సినిమా కంటెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఎవ్వరూ ఊహించని విధంగా అవార్డు కొల్లగొట్టింది.
ఇక థమన్ సంగీత విశ్వరూపం చూపించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం ఉత్తమ సంగీత చిత్రంగా నిలవడం విశేషం. థమన్ కు కూడా అవార్డు వచ్చినట్టు తెలిసింది.
Recommended Videos