Homeఎంటర్టైన్మెంట్Ramya Raghupathi: నరేష్ తల్లి విజయనిర్మల నన్ను కోడలిగా చూడలేదు... మరో సంచలనానికి తెరలేపిన రమ్య...

Ramya Raghupathi: నరేష్ తల్లి విజయనిర్మల నన్ను కోడలిగా చూడలేదు… మరో సంచలనానికి తెరలేపిన రమ్య రఘుపతి 

Ramya Raghupathi: నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. నరేష్ భార్యగా తన జీవితంలో జరిగిన సంఘటనలు బయటపెడుతున్నారు. నరేష్ పై ఆమె సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. నరేష్ ని రమ్య క్యారెక్టర్ లెస్ వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. నరేష్ ని ఉద్దేశిస్తూ రమ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాగా నరేష్ తల్లిగారైన విజయనిర్మల గురించి రమ్య తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ఊహించని విధంగా విజయనిర్మల చాలా మంచివారని ఆమె చెప్పుకొచ్చారు.

Ramya Raghupathi
Ramya Raghupathi

విజయనిర్మల గొప్ప వ్యక్తి. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆమెతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఏనాడూ నన్ను కోడలిగా చూడలేదు. కన్నకూతురి వలె ఆదరించారు. నేను కూడా అత్తయ్య అనేదాన్ని కాదు. అమ్మ అని పిలిచేదాన్ని. ఆమె,నేను కూర్చొని గంటల తరబడి అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. నాకు కొడుకు పుట్టినప్పుడు విజయనిర్మల చాలా సంతోషించారు. నా బిడ్డను ఎత్తుకొని రోజూ ఆడించేవారు. ఆమె అకాల మరణం పొందడం దురదృష్టకరం. విజయనిర్మల బ్రతికుంటే బాగుండేది. నాకు ఈ దుస్థితి వచ్చేది కాదని రమ్య వెల్లడించారు.

విజయనిర్మల 2019లో అకాల మరణం పొందారు. గుండెపోటుతో విజయనిర్మల కన్నుమూశారు. ఆమె బ్రతికి ఉన్నప్పటికే నరేష్ తో రమ్య రఘుపతి విడిపోయారు. ఎందుకంటే నరేష్-రమ్య విడిపోయి ఐదేళ్లు దాటిపోతుంది. కృష్ణ-విజయనిర్మల అనుక్షణం కలిసి ఉండేవారు. నరేష్ ఇంట్లోనే విజయనిర్మల ఉండేవారు. దీంతో విజయనిర్మల-కృష్ణలతో రమ్య రఘుపతికి అనుబంధం ఉంది. నరేష్, రమ్య, కృష్ణ, విజయనిర్మల ఒకే ఇంట్లో ఉండటం వలన వారి కోడలిగా రమ్య అనుబంధం పెంచుకున్నారు.

Ramya Raghupathi
Ramya Raghupathi

2022 నవంబర్ లో కృష్ణ కన్నుమూశారు. కృష్ణ మరణాంతర కార్యక్రమాల్లో నరేష్-పవిత్ర లోకేష్ అన్నీ తానై వ్యవహరించారు. కృష్ణను చివరి చూపు చూసేందుకు రమ్య రఘుపతి పద్మాలయ స్టూడియోకి రావడం జరిగింది. కాగా నరేష్ పవిత్ర లోకేష్ తో వివాహం ప్రకటించారు. దీన్ని రమ్య రఘుపతి ఖండిస్తున్నారు. చట్టబద్ధంగా నాకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడం నేరమని ఆమె ఆరోపిస్తున్నారు. నాకు నరేష్ తో విడాకులు వద్దు, ఆయనే కావాలి. నా కొడుకు తండ్రిని కోరుకుంటున్నాడంటూ రమ్య ప్రతిఘటిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version