https://oktelugu.com/

Naresh – Pavitra Lokesh Marriage : నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి ఫొటోలు వైరల్

Naresh – Pavitra Lokesh Marriage : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ అత్యంత రహస్యంగా సన్నిహితుల మధ్య నాలుగో పెళ్లి చేసుకున్నాడు. తన మూడో భార్య రమ్య నుంచి విడాకులు పొందకుండానే.. ఇంకా కోర్టులో వారికి విడాకులు మంజూరు కాకుండానే ఏకంగా పవిత్రా లోకేష్ మెడలో మూడు ముళ్లు వేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లు సమాచారం. సంప్రదాయబద్దంగా పవిత్రమెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు నరేష్. కొద్దిరోజుల కిందటే […]

Written By: , Updated On : March 10, 2023 / 12:53 PM IST
Follow us on

Naresh – Pavitra Lokesh Marriage : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ అత్యంత రహస్యంగా సన్నిహితుల మధ్య నాలుగో పెళ్లి చేసుకున్నాడు. తన మూడో భార్య రమ్య నుంచి విడాకులు పొందకుండానే.. ఇంకా కోర్టులో వారికి విడాకులు మంజూరు కాకుండానే ఏకంగా పవిత్రా లోకేష్ మెడలో మూడు ముళ్లు వేశారు.

అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లు సమాచారం. సంప్రదాయబద్దంగా పవిత్రమెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు నరేష్.

కొద్దిరోజుల కిందటే న్యూఇయర్ సందర్భంగా పవిత్రకు ఘాటు ముద్దు పెట్టి మరీ తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వీడియోను నరేష్ విడుదల చేసి సంచలనానికి తెరతీశాడు.

ఇప్పుడు అన్నట్టుగానే నరేష్ ఏకంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పవిత్రను పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ మేరకు నరేష్ కొద్దిసేపటి క్రితం షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.