
Naresh – Pavitra Lokesh Marriage: సీనియర్ నటుడు నరేష్, పవిత్ర మొత్తానికి అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సమక్షంలో వీరు సాంప్రదాయంగా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నరేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచామని క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్న తేదీని మాత్రం ప్రకటించలేదు.ఇదిలా ఉండగా ఓ వైపు తండ్రి కృష్ణ చనిపోయి ఏడాది కాకముందే నరేశ్ వివాహం ఎలా చేసుకున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. తండ్రి పోయిన బాధ కంటే పవిత్రను పెళ్లి చేసుకోవడమే నరేశ్ కు ముఖ్యమైనదా? అని అంటున్నారు.
గతేడాది నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. కృష్ణకు ఇందిర తో పాటు నటి విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు. విజయనిర్మలకు అప్పటికే కుమారుడు ఉన్నారు. ఆయనే నరేష్. విజయనిర్మలను పెళ్లి చేసుకున్న తరువాత ఆయన కుమారుడు నరేశ్ ను కూడా కృష్ణ తన సొంత కొడుకులాగే భావించారు. ఒకదశలో ఆయనను సినిమాల్లో ప్రోత్సహించించి కృష్ణ నే అని చెప్పుకుంటారు. అంతేకాకుండా సొంత కుమారుల కంటే నరేశ్ పై ఎక్కువగా ప్రేమ చూపించేవారని, అందుకే ఎక్కవ శాతం నరేశ్ నే పక్కన ఉంచుకునేవారని అన్నారు. అలాంటి కృష్ణ చనిపోయి ఏడాది కాకముందే నరేశ్ పెళ్లి పీటలెక్కారు. తండ్రి లేడన్న పోడాయన్న దు:ఖంలో ఉన్నాడనుకుంటే ఇలా పెళ్లికొడుకుగా చిరునవ్వులు చిందించడంపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
కృష్ణ మరణించిన సమయంలో కూడా నరేష్ ప్రవర్తన వింతగా ఉందని కొందరు కామెంట్లు చేశారు. ఈ సమయంలో కృష్ణ లేడనే బాధ కన్నా పవిత్రతో కలిసి ఉండడాన్ని కొందరు తప్పుబట్టారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ వీరి కలయికను వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే కృష్ణ సంస్మరణ సభలో నరేష్, పవిత్ర లోకేశ్ ను చూసి ఆయన అసహనం వ్యక్తం చేశారని కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీని నరేశ్ కలుసుకోనట్లు సమాచారం.

తాజాగా నరేశ్ ఒక్కసారిగా పెళ్లి కుమారడిగా దర్శనమిచ్చేసరికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత తండ్రి కాకపోయినా అంతకంటే ఎక్కవ అయిన కృష్ణ చనిపోయి ఏడాది కాకముందే నరేష్ఎలా పెళ్లి చేసుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. గతంలో పలు సార్లు కృష్ణ ఇంట్లో ఎలాంటి కార్యక్రమానికైనా నరేశ్ కలిసిమెలిసి ఉండేవారు. కానీ కృష్ణ చనిపోయిన తరువాత వారికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇందిర కుటుంబ సభ్యులకు సైతం ఈ వివాహానికి ఆహ్వనించనట్లు తెలుస్తోంది.
ఇక తాము ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఇదివరకే చెప్పిన నరేష్, పవిత్ర లు త్వరలో తాము పెల్లి చేసుకుంటామని ఇదివరకే ప్రకటించారు. అయితే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నది తెలియకపోయినా అందుకు సంబంధించిన వీడియోను నరేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. ఈ వీడియోలో నరేష్ పెళ్లి కొడుకుగా చిరునవ్వులు చిందిస్తుండగా.. పవిత్ర సైతం సిగ్గుపడుతూ కనిపించింది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) March 10, 2023