Narappa Re Release Collections: విక్టరీ వెంకటేష్ నుండి సోలో మూవీ విడుదలై చాలా కాలం అయ్యింది..’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చెట్టు సినిమా నుండి ఆయన చేసిన సినిమాలన్నీ 90 శాతం వరుకు మల్టీస్టార్ర్ర్ సినిమాలే..దాంతో వెంకటేష్ ప్రస్తుత మార్కెట్ రేంజ్ ఎంత అనేది ఎవ్వరూ పసిగట్టలేకున్నారు..కానీ ఆయన ఇప్పుడు ఒక్కో సినిమాకి పది కోట్ల రూపాయిల వరుకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..అభిమానులు వెంకటేష్ సోలో చిత్రం విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వచ్చారు.

వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ వెంకటేష్ నుండి ‘నారప్ప’ మరియు ‘దృశ్యం 2 ‘ అనే రెండు స్ట్రెయిట్ సినిమాలు వచ్చాయి..కానీ బ్యాడ్ లాక్ ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా నేరుగా ఓటీటీ లోనే విడుదల అయ్యాయి..రెండిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..వాటిల్లో మనం ముందుగా నారప్ప సినిమా గురించి మాట్లాడుకోవాలి..తమిళం లో ధనుష్ హీరో గా నటించిన ‘అసురన్’ అనే సినిమాకి ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కింది.
తమిళం లో ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ధనుష్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు ని తెచ్చిపెట్టింది..అలాంటి సినిమాని రీమేక్ చెయ్యడం అంటే సాహసమే..కానీ వెంకటేష్ రీమేక్ చేసి ధనుష్ కంటే అద్భుతంగా నటించాడు..అయితే అప్పట్లో ఈ సినిమాని థియేటర్స్ లో కాకుండా ఓటీటీ లో నేరుగా విడుదల చేస్తున్నందుకు అభిమానులు పెద్ద ఎత్తున నిరసన చేసారు..కానీ సురేష్ బాబు అప్పుడు ఉన్న పరిస్థితులను పసిగట్టి అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇచ్చిన ఫాన్సీ ఆఫర్ కి ఓకే చెప్పి ఓటీటీ లో విడుదల చేసారు..ఇక మొన్నవెంకటేష్ పుట్టిన రోజు నాడు ఈ సినిమాని ఒక్కరోజు థియేటర్స్ లో ప్రదర్శించారు..పబ్లిసిటీ అసలు లేకపోవడం తో ఈ చిత్రం రీ రిలీజ్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఒక్క చోట కూడా హౌస్ ఫుల్ పడకపోవడం విశేషం..అలా ఒక్క రోజు థియేటర్స్ లో ప్రదర్శితమైన ఈ సినిమాకి పాతిక లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయి..థియేటర్స్ లో ఇప్పటి వరుకు విడుదల కాని సినిమాకి ఇంత తక్కువ వసూళ్లు వచ్చాయంటే వెంకటేష్ మార్కెట్ బాగా పడిపోయిందా అనే సందేహాలు ట్రేడ్ విశ్లేషకుల్లో మొదలయ్యాయి.