Bigg Boss 6 Telugu Episode 102: ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకుల మతులను పోగొడుతూ బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరి వారం లోకి అడుగుపెట్టింది..గత వారం ఇనాయ ఎలిమినేట్ అయిపోవడం తో ఇప్పుడు హౌస్ లో ఆది రెడ్డి , రేవంత్ , రోహిత్ , శ్రీహాన్ , కీర్తి మరియు శ్రీ సత్య మిగిలారు..ఈ ఆరుగురిలో నేడు ‘మిడ్ వీక్ ఎలిమినేషన్’ కారణంగా శ్రీ సత్య బయటకి వెళ్ళిపోబోతుందట..ఇక మిగిలిన టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరు టైటిల్ గెలుచుకోబోతున్నారు అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్.

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ జర్నీ ని చూపించారు..కనీసం ఈ వారం అయినా టాస్కులు లేకుండా ప్రశాంతం గా గడిచిపోతుంది అని అందరూ అనుకుంటున్న సమయం లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి మరో టాస్కు ఇచ్చాడు..ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ లో ఒకరికి ప్రేక్షకులకు తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకొని ఓట్లు అడిగే అవకాశం ని కల్పించాడు బిగ్ బాస్.
కానీ ఆ అవకాశం ఒక టాస్కు ఆడి, అందులో గెలిచి ప్రేక్షకులను ఓట్లు అడగాల్సి ఉంటుంది..ఈ టాస్కులో బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ ని ప్లే చేస్తాడు..ఆ సౌండ్స్ ని కంటెస్టెంట్స్ కరెక్ట్ గా అందుకొని పేర్లు ఆ సౌండ్ ఏమిటో పేపర్ లో రాయాలి..ఎవరైతే ఎక్కువ శాతం కరెక్ట్ గా సౌండ్స్ ని గుర్తుపట్టి రాస్తారో..వాళ్ళు టాస్కు గెలిచినట్టు..ఆ గెలిచిన కంటెస్టెంట్ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఓట్లు రిక్వెస్ట్ చేసే అవకాశం ని కల్పిస్తాడు బిగ్ బాస్..ఈ టాస్కు లో శ్రీ సత్య డిస్టర్బ్ చెయ్యడం వల్ల శ్రీహాన్ కొన్ని శబ్దాలను సరిగా వినలేక తప్పులు రాస్తాడు..దాంతో శ్రీహాన్ కోపం తో శ్రీ సత్య ని అరుస్తాడు..’నీ వల్లే నేను ఓడిపోయాను’ అని అంటాడు శ్రీహాన్.

అప్పుడు శ్రీ సత్య ‘నేను ఒక్కసారి మాత్రమే మాట్లాడాను..మిగిలిన సమయం లో నువ్వు పాయింట్స్ రప్పించుకోవచ్చు కదా’ అని అంటుంది..అలా వీళ్లిద్దరి మధ్య గొడవ నడుస్తుండగా బిగ్ బాస్ ఆది రెడ్డి మరియు రోహిత్ ఓట్లు అడిగేందుకు దగ్గర్లో ఉన్నాడు అని చెప్తారు..ఇద్దరికీ టై పడగా ఇంటి సభ్యుల వోటింగ్ ద్వారా ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లకి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం ని కల్పిస్తాడు బిగ్ బాస్..అందరూ రోహిత్ కి వోట్ వేస్తారు..ఫైనల్ గా అతను టాస్క్ గెలుస్తాడు.