The Paradise Teaser: దసర (Dasara) సినిమాతో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)… ఆయన చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం నానితో ‘ప్యారడైజ్ ‘ (Paradaise) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ ని కూడా వదిలారు. ఈ వీడియోలో నాని రెండు జడలు వేసుకొని ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఇక అతని చేతుల మీద ఉన్న టాటూను చూస్తే మనందరికి ఇదొక డిఫరెంట్ వరల్డ్ లో సాగే సినిమా ఏమో అనే ఆసక్తి అయితే కలుగుతుంది. మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…
Also Read: ‘కడుపు మండిన కాకుల కథ’..దుమ్ములేపిన నాని ‘ది ప్యారడైజ్’ టీజర్..కానీ అవేమి బూతులు సామీ!
నిజానికి ఎక్కడ రివిల్ చేయకుండా రెండు జడలు వేసుకున్న బ్యాక్ షాట్ నుంచి అతన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ గెటప్ లో కనిపించింది నాని ఏనా, లేదంటే వేరే వ్యక్తా అనేది ఇంట్రడ్యూస్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టడం అనేది సినిమా మీద హైప్ ని క్రియేట్ చేసే స్ట్రాటజీ అయి ఉంటుంది. అందుకే శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు ఒక స్ట్రాటజీని వాడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్న క్రమంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే ఒక స్టార్ డైరెక్టర్ గా శ్రీకాంత్ ఓదెల ఎదుగుతాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన క్లియర్ కట్ విజువల్స్ ని ఎందుకు అందించలేకపోయాడు. సినిమా ఒక తెగకు సంబంధించి జరగబోతుందా సినిమా టైం పీరియడ్ ఏంటి? ఏ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు హాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున సినిమాలు వచ్చేవి కానీ మన దర్శకులు సైతం హాలీవుడ్ లో ఎక్కడ తగ్గకుండా సినిమాల్లో చేస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
