Dasara Twitter Review : నేచురల్ స్టార్ నాని ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం దసరా. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. నాని డీ గ్లామర్ రోల్ చేయగా ఆయన లుక్ జనాల్లో ఆసక్తి రేపింది. ఇక సాంగ్స్, ప్రోమోలు అంచనాలు పెంచేశాయి. హీరో నాని నుండి ఓ డిఫరెంట్ మూవీ చూడబోతున్నామన్న అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు. ఇక నాని దసరా చిత్ర విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. దాదాపు నెల రోజులుగా నాని విశ్రాంతి లేకుండా దసరా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇండియా మొత్తం చుట్టేశారు.
ఎదురు చూపులకు తెరపడింది. దసరా మూవీ శ్రీరామనవమి కానుకగా థియేటర్స్ లోకి వచ్చేసింది. మార్చి 30న వరల్డ్ వైడ్ విడుదలైంది. 29వ తేదీ అర్ధరాత్రి నుండి ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. యూఎస్ లో ఫస్ట్ షో పడగా మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఆడియన్స్ ట్విట్టర్ షార్ట్ రివ్యూస్ గమనిస్తే… టాక్ పాజిటివ్ గా ఉంది. హీరో నాని పెర్ఫార్మన్స్ గురించి ప్రతి ఒక్కరూ ప్రస్తావిస్తున్నారు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.
https://twitter.com/ursHemanthRKO/status/1641253122629840897?s=20
నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారంటున్నారు. ధరణి పాత్రకు వంద శాతం న్యాయం చేశారంటున్నారు. కీర్తి సైతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. నాని యాక్టింగ్ తర్వాత దసరా మూవీ సినిమాటోగ్రఫీ గురించి ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. విజువల్స్ ఆకట్టుకున్నాయన్న మాట వినిపిస్తోంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ పర్లేదు అంటున్నారు. బిజీఎం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదంటునున్నారు. మరి కొందరు గుడ్ అంటున్నారు.
ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ మెప్పిస్తాయంటున్నారు. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనంతరం సెకండ్ హాఫ్ బోరింగ్ గా సాగుతుందనేది దసరా మూవీపై వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్స్. ఎమోషనల్ సీన్స్ ఎక్కువై పోయాయని, ఈ క్రమంలో రెండవ భాగం కాసేపు విసుగు పుట్టిస్తుంది. నెరేషన్ కూడా ప్రిడిక్టబుల్ గా ఉందంటున్నారు. ఇవి దసరా సినిమాకు మైనస్ గా పాయింట్స్ గా చెబుతున్నారు.
#Dasara 1st half good…Nani as dharani incredible performance… casting team done good job// friendship content nice (dharani + suri) // interval wshh…2nd half slow paced aana climax scene super.. Sana bgm and album impressive overall satisfied // Shine good scope in the movie pic.twitter.com/w4tk8Qk0lc
— Thusan (@thusannathan) March 30, 2023
మొత్తంగా దసరా డీసెంట్ మూవీ. అదిరిపోయే విజువల్స్, అబ్బురపరిచే నాని పెర్ఫార్మన్స్ ఆడియన్స్ కి కిక్ ఇస్తాయి. కొత్త దర్శకుడు అయినప్పటికీ శ్రీకాంత్ ఓదెల ప్రతిభ చూపించాడు. దసరా కథను ఎంగేజింగ్ గా నడపడంలో ఆయన సక్సెస్ అయ్యారంటున్నారు. ఇక ట్విట్టర్ టాక్ ఇలా ఉంది. మూవీకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. నాని గత చిత్రాల రికార్డ్స్ దసరా బ్రేక్ చేసింది. ఈ మధ్య కాలంలో నాని సినిమాలకు పాజిటివ్ టాక్ దక్కుతుంది. రిజల్ట్ మాత్రం తేడా కొడుతుంది. దసరా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి…
https://twitter.com/anandgumparthi/status/1641226821705318401
#Dasara Overall A Pretty Decent Raw and Rustic Village Drama!
Though the pace is mostly slow and a few parts feel stretched out, the drama has worked for the most part with some good sequences and well done climax. Nani’s career best performance.
Rating: 2.75-3/5
— Venky Reviews (@venkyreviews) March 29, 2023
#Dasara 2nd half is bore to the core….
— P M (@iSayQi) March 30, 2023