Nandigama: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఈ నానుడి ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి విషయంలో నిజమే అనిపిస్తుంది. అతిచిన్న వయసులోనే వండర్స్ క్రికెట్ చేసి వరల్డ్ రికార్డు కొట్టేసింది. తల్లిదండ్రులను కూడా సరిగా గుర్తుపట్టలేని వయసులో ఆ చిన్నారి ఏకంగా 120 రకాల వస్తువులను గుర్తించి చరిత్ర సృష్టించింది. తల్లి తర్ఫీదుతో ఈ రికార్డును సొంతం చేసుకుంది వండర్ కిడ్.
చిన్నారి కోసం ఆట వస్తువులు..
పిల్లల కోసం తల్లిదండ్రులు ఆట వస్తువులు కొనుగోలు చేయడం సాధారణం. వాటిని చూడగానే పసి పిల్లలు ఎగ్జయిట్ అవుతారు. సంతోషపడతారు. ఇక తల్లిదండ్రులు కనిపించకుంటే ఏడుస్తారు. ఆకలైనా ఏడుస్తారు. మూడు నాలుగు నెలల వయసులో చిన్నచిన్న శబ్దాలు చేస్తారు. అయితే కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కౌవల్య మాత్రం సూపర్ కిడ్ అనిపించుకుంటోంది. బిడ్డ కోసం తల్లిదండ్రులు కొని తెచ్చిన వస్తువుల పేర్లు చెబుతూ వండర్ క్రికెట్‌చేస్తోంది.
తల్లి తర్ఫీదుతో..
కౌవల్య తల్లి హేమ.. తన బిడ్డ కంటి చూపు మెరుగుపర్చడం కోసం బొమ్మతో ఆడించడం మొదలు పెట్టింది. అయితే బిడ్డ వస్తువులను గుర్తుపట్టడం గుర్తించిన హేమ.. అలాగే తర్ఫీదు ఇచ్చింది. దీంతో 120 రకాల వస్తువులను కైవల్య గుర్తించిందిం. దీంతో హేమ ఓ వీడియో రికార్డు చేసి దానిని నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపించింది. నాలుగు నెలల వయసులోనే 120 రకాల వస్తువులను గుర్తించడం చూసి వరల్డ్ రికార్డ్స్ వారు కూడా ఆశ్చర్యపోయారు. ఫిబ్రవరి 13న పాప తల్లిదండ్రులకు ప్రశంసతో కూడిన పత్రాన్ని, పతకాన్ని పంపించారు.
ఆన్‌లైన్‌లో ఫ్లాష్ కార్డులు కొని..
పాప కోసం హేమ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసింది. వాటిని నిత్యం పాపకు చూపడం ద్వారా కైవల్య వాటిని నిషితంగా గమనిస్తూ వచ్చింది. కార్డు చూపుతూ దానిపై ఉన్న చిత్రం పేరు చెప్పడంతో దానిని గుర్తించడం అలవాటు చేసుకుంది. తర్వాత కార్డులో ఉన్న వస్తువు పేరు చెప్పగానే పాప దానిని పట్టుకోవడం గ్రహించారు. ఇలా 120 రకాల వస్తువుల కార్డులను పట్టుకుంది. దీంతో హేమ తన కూతురుకు కార్డులను మార్చి మార్చి చూపినా గుర్తించడం గమనించింది.
4 నెలల పాప ప్రపంచ రికార్డు
ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది.
కైవల్య అనే 4 నెలల పాప.. పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా 120 రకాల ఫోటోలు గుర్తించగలదు.
కైవల్య తల్లి హేమ తన పాప ప్రత్యేక… pic.twitter.com/OXPMP8ZUSc
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2024