https://oktelugu.com/

Veera Simha Reddy Trailer : దుమ్ములేపేసిన ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్..ఈ సంక్రాంతి బాలయ్యదే!

Veera Simha Reddy Trailer  : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతోంది.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఒంగోలులో ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేసింది..ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సంక్రాంతికి బాలయ్య బాబు మరోసారి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2023 / 08:54 PM IST
    Follow us on

    Veera Simha Reddy Trailer  : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతోంది.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఒంగోలులో ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేసింది..ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

    ఈ సంక్రాంతికి బాలయ్య బాబు మరోసారి దుమ్ములపేయబోతున్నాడు అని అర్థమవుతోంది.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కి చాలా టఫ్ పోటీ ఇవ్వబోతున్నాడు అనేది స్పష్టమైంది.. లుక్స్ దగ్గర నుండి డైలాగ్ డెలివరీ వరకు బాలయ్య బాబు మరోసారి తనలోని ‘ది బెస్ట్’ ని చూపించాడు.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి.. బాలయ్య మార్క్ లో చాలా పవర్ ఫుల్ గా డైలాగ్స్ రాసాడు గోపీచంద్ మలినేని.. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.

    ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విజయ్ నటించాడు.. ఇదే తెలుగులో ఆయనకి మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో అతను స్టార్ విలన్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది.. బాలయ్య సినిమాల్లో విలన్ గా చేసిన అలనాటి హీరోస్ కి మంచి క్రేజ్ వస్తుంది.. లెజెండ్ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబు కెరీర్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక పవర్ ఫుల్ పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

    ఈ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని గతంలో తీసిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి విలన్ గా నటించింది.. కానీ ఇందులో బాలయ్య కి చెల్లెలు గా నటించింది..ఇక ఈ ట్రైలర్ లో బాలయ్య చెప్పిన ‘సీమ లో ఎవ్వరు కత్తి పట్టకుండా ఉండేందుకు నేను కత్తి పట్టాను’ అనే డైలాగ్ బాగా రీచ్ అయ్యే విధంగా ఉంది.. అలా మాస్ కి ఫుల్ మీల్స్ లాగా అనిపిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.