
Mokshagna First Movie: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది ఈసారి పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటున్నారే కానీ, ఆయన మొదటి సినిమాకి సంబంధించిన ఊసే కనిపించడం లేదు. అయితే బాలయ్య బాబు 2025 వ సంవత్సరం లో కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా థియేటర్స్ లో ఉంటుంది అని అభిమానులకు హామీ ఇచ్చాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.
అంతే కాదు మోక్షజ్ఞ గతం లో విడుదలైన ఫోటోలలో లావుగా ఉండడం చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇప్పుడు ఫిజిక్ మీద కూడా మోక్షజ్ఞ ద్రుష్టి సారించాడట. ఇప్పటికే ఆయన మూడు కేజీల బరువు తగ్గాడట, మోక్షజ్ఞ మొదటి సినిమా కి సంబంధించి కథలను కూడా వింటూ ఉన్నాడట బాలయ్య. పూర్తి వివరాలు ఇప్పటికైతే తెలియవు కానీ, ఫిలిం నగర్ లో సర్క్యూలేట్ అవుతున్న ఒక వార్త మాత్రం అభిమానులను ఉర్రూతలూ ఊగిస్తుంది.
అసలు విషయానికి వస్తే రీసెంట్ సమయం లో త్రివిక్రమ్ భార్య సౌజన్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు, అందులో మొదటి కొడుకు త్వరలోనే సినీ రంగం లోకి అడుగుపెట్టబోతున్నట్టు ఈ సందర్భంగా ఆమె తెలిపింది. దర్శకత్వం మీద వాడికి ఉన్న కమాండ్ ని చూసి త్రివిక్రమ్ సైతం ఆశ్చర్యపోటూ ఉంటాడు.

అంత గొప్ప టాలెంట్ ఉంది వాడిలో అంటూ సౌంజన్య ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అయితే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు సినీ రంగ ప్రవేశం ఒకే సమయం లో జరగబోతుందట. అంటే వీళ్లిద్దరు కలిసి ఒకే సినిమాకి పని చేయబోతున్నారా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఒకవేళ నిజంగా ఇది జరిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం అనే చెప్పొచ్చు.