https://oktelugu.com/

Mahesh Babu- Namrata Dating : డేటింగ్ టైం లో మహేష్ నాతో అలా ప్రవర్తించాడు… ఎట్టకేలకు ఆ రహస్యాలు బయటపెట్టిన నమ్రత!

Mahesh Babu- Namrata Dating : మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2005లో అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా వీరి వివాహం జరిగింది. నమ్రతను మహేష్ పెళ్లి చేసుకోవడం కృష్ణకు ఇష్టం లేదని, అందుకే మహేష్ రహస్య వివాహం చేసుకున్నారు. చేసేది లేక కృష్ణ, కొడుకు మహేష్ పెళ్లికి హాజరయ్యాడనే వాదన ఉంది. మహేష్ పెళ్లి వార్త అప్పట్లో సంచలనం రేపింది. చడీ చప్పుడు లేకుండా మహేష్ లాంటి స్టార్ పెళ్లి చేసుకోవడం టాలీవుడ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2022 / 07:39 PM IST
    Follow us on

    Mahesh Babu- Namrata Dating : మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2005లో అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా వీరి వివాహం జరిగింది. నమ్రతను మహేష్ పెళ్లి చేసుకోవడం కృష్ణకు ఇష్టం లేదని, అందుకే మహేష్ రహస్య వివాహం చేసుకున్నారు. చేసేది లేక కృష్ణ, కొడుకు మహేష్ పెళ్లికి హాజరయ్యాడనే వాదన ఉంది. మహేష్ పెళ్లి వార్త అప్పట్లో సంచలనం రేపింది. చడీ చప్పుడు లేకుండా మహేష్ లాంటి స్టార్ పెళ్లి చేసుకోవడం టాలీవుడ్ ని ఊపేసింది. 

    ఆరోజుల్లో సోషల్ మీడియా ప్రభావం లేదు. ఐదేళ్లు ప్రేమించుకున్నా మహేష్-నమ్రతల ప్రేమ వ్యవహారం బయటకు రాలేదు. అదే ఈ రోజుల్లో అయితే చీమ చిటుక్కుమన్నా మీడియాకు తెలిసిపోతుంది. అలాంటిది 2000 నుండి 2005 వరకు మహేష్-నమ్రతల ప్రేమాయణం సాగించారు. నమ్రత-మహేష్ మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు ఎలాంటి పుకార్లు వినిపించలేదు. కాగా ఎట్టకేలకు నమ్రత తన డేటింగ్ మ్యాటర్ బయటపెట్టారు. తాము రిలేషన్ లో ఉన్నప్పుడు మహేష్ ఎలా ఉండేవారో ఆమె చెప్పుకొచ్చారు. 
     
    మహేష్ చాలా ఎంటర్టైనింగ్ పర్సన్. తనతో ఉంటే సమయం తెలిసేది కాదు. తనతో ఎంత సమయం గడిపినా బోర్ కొట్టేది కాదు. నచ్చే విషయాలు చెబుతూ సంతోషంగా సంతోషంగా ఉంచేవారని నమ్రత చెప్పారు. ఇక మహేష్ సినిమాల షూటింగ్ లొకేషన్స్ కి నమ్రత తరచుగా వెళ్లేవారట. షూటింగ్ అయిపోగానే ఇద్దరూ కలుసుకునేవారట. ఈ క్రమంలో మహేష్ ఫ్రెండ్స్ నమ్రతకు కూడా క్లోజ్ అయ్యారట. అలా ఇద్దరూ చాలా ఆనందంగా రిలేషన్ ఎంజాయ్ చేశారట. అలాగే మహేష్ సిస్టర్ మంజుల నమ్రతకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారట. మహేష్ తో లాంగ్ రిలేషన్ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. 
     
    ఎంత ఘాడంగా ప్రేమించుకున్నప్పటికీ పెళ్ళికి ముందు మహేష్-నమ్రత మధ్య కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయట. తన భార్య ఎలా ఉండాలో పూర్తి అవగాహన ఉన్న మహేష్ పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలి అన్నారు. నాకు కూడా నటించడం ఇష్టం లేదు. ఆఫర్స్ వచ్చినప్పటికీ తిరస్కరించాను, అని నమ్రత వెల్లడించారు. భార్యాభర్తలుగా ఈ స్టార్ కపుల్ 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇన్నేళ్ల లో చిన్న గొడవపడ్డ దాఖలాలు లేవు. చాలా అన్యోన్యంగా ఉండే మహేష్ జంట చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. మహేష్ ని నమ్రత ఎంతగానో ప్రేమిస్తారు. అదే స్థాయిలో మహేష్ తన కుటుంబం కోసం ఆలోచిస్తాడు.