Mahesh Namratha : హై కల్చర్డ్ సొసైటీలో పెళ్లి కూడా ఒక ఒప్పందమే. లైఫ్ టైం రిలేషన్ లో అడుగు పెట్టబోయే ముందు అమ్మాయి అబ్బాయి మధ్య పరస్పర అవగాహన కుదరడం తప్పేమీ కాదు. ఇది భవిష్యత్తులో మనస్పర్థలు రాకుండా కాపాడుతుంది. జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్-నమ్రతల మధ్య కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయట. మహేష్ నమ్రతకు ఒక కండీషన్ పెడితే ఆమె తిరిగి మహేష్ కి ఒక కండీషన్ పెట్టిందట.
పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలి. గృహిణిగా మారాలని చెప్పారట. అందుకు నమ్రత ఒప్పుకున్నారట ఇక నమ్రత మహేష్ కి పెట్టిన కండీషన్ మాత్రం కొంచెం భిన్నమైనది. పెళ్ళైన వెంటనే ఒక బంగ్లాలో కాపురం చేయడం నావల్ల కాదు. నాకు పరిస్థితులు అలవాటు పడే వరకు మనం ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసిద్దాం అన్నారట. మహేష్ సరే అన్నారట. పెళ్లి తర్వాత ఇద్దరూ తమ మాట నిలబెట్టుకున్నారు. నమ్రత మరలా వెండితెరపై కనిపించలేదు.
ఇక మహేష్ జూబ్లీహిల్స్ లో జర్నలిస్ట్ కాలనీ సమీపంలో గల ఒక అపార్ట్మెంట్ లో కొత్త కాపురం మొదలుపెట్టాడు. చాలా కాలం నమ్రత, మహేష్ దంపతులు అక్కడే ఉన్నారు. సెలెబ్రిటీలు ఎవరైనా ప్రశాంతగా ఇతరులతో సంబంధం లేకుండా విలాసవంతమైన భవంతిలో నివసించేందుకు ఇష్టపడతారు. దానికి భిన్నంగా నమ్రత ఆలోచనలు ఉన్నాయి. బహుశా ముంబైలో ఆమె చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం, అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడటం వలన నమ్రత అలాంటి భిన్నమైన కండిషన్ పెట్టి ఉండవచ్చు. మొదటి సంతానం విషయంలో కూడా మహేష్ కండీషన్ పెట్టారట. ఫస్ట్ ఒక చైల్డ్ కి బర్త్ ఇచ్చాక, కావలసినంత సమయం తీసుకో అన్నారట.
2005లో మహేశా-నమ్రతల వివాహం అత్యంత గోప్యంగా సన్నిహితుల మధ్య జరిగింది. 2006లో మొదటి సంతానం గౌతమ్ జన్మించాడు. గౌతమ్ ది ఎమర్జెన్సీ ల్యాండింగ్. నెలలు నిండక ముందే పుట్టాడు. జనరల్ చెకప్ కి వెళ్లిన నమ్రతను స్కాన్ చేసినప్పుడు కడుపులో బిడ్డ శ్వాస సరిగా తీసుకోవడం లేదు. ఏదో సమస్య తలెత్తిందని గుర్తించారట. పిండం పల్స్ రేట్ పడిపోయిన నేపథ్యంలో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాలని చెప్పారట. అప్పుడు మహేష్ షూట్ హైదరాబాద్ లో జరుగుతుందట, ఆయనకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి చేరుకున్నారట. ఆపరేషన్ తీసిన బయటకు తీసిన బిడ్డ కేవలం ఒకటిన్నర కేజీ మాత్రమే ఉన్నాడట. చాలా చిన్నగా అరచేయి అంత సైజులో ఉన్నాడట. గౌతమ్ ఇప్పుడు జీవిస్తున్నాడు అంటే డాక్టర్స్ కృషే అని నమ్రత చెప్పుకొచ్చారు.