Nagarjuna 100th Film: టాలీవుడ్ లో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చెయ్యాలనే తపనతో ఉండే స్టార్ హీరో అక్కినేని నాగార్జున.తన తోటి హీరోలు కమర్షియల్ పంథా లో స్టార్ స్టేటస్ ని అందుకుంటే, నాగార్జున మాత్రం విన్నూతన ప్రయోగాలు ఎన్నో చేసి సక్సెస్ లు కొట్టి స్టార్ హీరో అయ్యాడు.బహుశా నాగార్జున చేసినన్ని ప్రయోగాలు ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా చెయ్యలేదు.
కొంతమంది ప్రయత్నం చేసారు కానీ, సక్సెస్ లు మాత్రం నాగార్జున రేంజ్ లో చూడలేకపోయారు.అందుకే ఆయనని అందరూ కింగ్ అని పిలుస్తారు, అయితే నాగార్జున ప్రయోగాలన్నీ సక్సెస్ కాలేదు,కొన్ని ఫ్లాప్స్ అయ్యాయి కూడా.అవి మామూలు ఫ్లాప్స్ కూడా కాదు, ఆయన స్టార్ ఇమేజి పొయ్యే రేంజ్ లో అన్నమాట.ప్రస్తుతం ఆయన ఎదురుకుంటున్న ఫేస్ ఇదే.60 ఏళ్ళ వయస్సులో కూడా ప్రయోగాలు వదలలేదు, అవి వికటించేలోపు ఆయన స్టార్ స్టేటస్ కూడా పొయ్యింది.
రీసెంట్ గా విడుదలైన ‘ఘోస్ట్’ చిత్రం కూడా పది కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లను సాధించి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.నాగార్జున లాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో, రెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా రేంజ్ ఫేమ్ ని సొంతం చేసుకున్న కెపాసిటీ ఉన్న స్టార్ కి ఇలాంటి వసూళ్లు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు.సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఈసారి నాగార్జున అభిమానులను అలరించే విధమైన సినిమాలు మాత్రమే చెయ్యాలని బలమైన నిర్ణయం తీసుకున్నాడట.అందుకు తగ్గట్టుగానే తన 99 వ సినిమా మరియు వందవ సినిమాని ప్లాన్ చేసుకుంటున్నాడు.
99 వ సినిమాకి ధమాకా మూవీ కి స్టోరీ అందించిన ప్రసన్న కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, 100 వ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.మోహన్ రాజా తమిళం లో టాప్ స్టార్ డైరెక్టర్, తెలుగు లో ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా చేసాడు.మంచి ప్రతిభ ఉన్న కమర్షియల్ డైరెక్టర్ గా అతనికి మంచి పేరుంది.కచ్చితంగా నాగార్జున కి భారీ హిట్ ఇస్తాడనే నమ్మకం తో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్..మరి వారి నమ్మకాలూ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.