Nagarjuna who took up illegal constructions : నిన్నటి తరం హీరోలలో అగ్ర కథానాయకుడిగా కొనసాగి, ఇప్పటికీ స్టార్ హీరోలతో సమానంగా పోటీపడుతూ సినిమాలు చేస్తున్న హీరో అక్కినేని నాగార్జున..కమర్షియల్ హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మరో స్థాయికి తీసుకెళ్లిన నటుడాయన..అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ కూడా ఏరోజు ఆయన తన తండ్రిని అనుకరించలేదు..తన సొంత స్టైల్ లో మనసుకి నచ్చిన సినిమాలు చేసి నేడు ఈ స్థాయికి ఎదిగాడు.
కేవలం హీరో గా మాత్రమే కాదు వ్యాపారవేత్తగా కూడా నాగార్జున దిగ్గజ స్థాయికి ఎదిగాడు..హైదరాబాద్ లో సగం ఆస్తులు , వ్యాపారాలన్నీ నాగార్జునవే అని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు..ఒకపక్క అన్నపూర్ణ స్టూడియోస్ ని మ్యానేజ్ చేస్తూనే మరోపక్క లెక్కలేనన్ని వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్ గా కూడా బంపర్ హిట్ అయ్యాడు..అయితే ఇది వరకు ఆయనకీ కేవలం హైదరాబాద్ లోనే వ్యాపారాలు ఉన్నాయని అందరూ అనుకునేవారు..కానీ నాగార్జున కి ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా వ్యాపారాలున్నాయి.
లేటెస్ట్ గా ఆయన గోవాలోని మాండ్రేమ్ అనే గ్రామంలో ఒక కమర్షియల్ బిజినెస్ కి సంబంధించిన కట్టడాలను ప్రారంభించాడు.. ఈ క్రమంలోనే ఆయనకీ అక్కడ ఒక షాక్ తగిలింది..మాండ్రేమ్ గ్రామ సర్పంచ్ నుండి వెంటనే అక్రమ కట్టడాలను ఆపాలంటూ నాగార్జున కి నోటీసులు జారీ అయ్యాయి..సర్వే నెంబర్ 211/2B ప్రాంతంలో ఎలాంటి అనుమతి లేకుండా నాగార్జున కి సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయని ..తక్షణమే ఆపని పక్షం లో పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వలు అందాయి.
మరి దీనికి నాగార్జున ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి..గతం లో కూడా నాగార్జున పై తెలంగాణాలో కొన్ని కబ్జా కేసులు ఉండేవి..తెలంగాణ ప్రభుత్వం ఆయన నిర్మించిన భవనాలను కూడా ఈ కారణం చేత కూల్చివేసింది..అప్పట్లో ఈ సంఘటన పెను దుమారం రేపింది..ఇప్పుడు ఇతర రాష్ట్రంలో కూడా నాగార్జున కి అలాంటి సంఘటన ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది.