https://oktelugu.com/

Movie Tickets: టికెట్ల వివాదం: నాగార్జున సినిమాకు ఇబ్బందే లేదట? టాలీవుడ్ కు షాక్

Movie Tickets Issue: ఎంతైనా జగన్ కు అత్యంత సన్నిహితుడు అగ్రహీరో నాగార్జున. వైఎస్ఆర్ కుటుంబంతో నాగార్జున ఆది నుంచి అవినావభావ సంబంధం ఉంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాగార్జున చాలా సార్లు కలిసి హైదరాబాద్ లోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక జగన్ సీఎం అయ్యాక కేవలం ఆయనను ఎప్పుడంటే అప్పుడు నేరుగా వెళ్లి కలవగలిగేంత చనువు కేవలం నాగార్జునకే ఉంది. అందుకే ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచాడు.. సినిమా విడుదల చేస్తే ఏపీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2022 / 10:24 PM IST
    Follow us on

    Movie Tickets Issue: ఎంతైనా జగన్ కు అత్యంత సన్నిహితుడు అగ్రహీరో నాగార్జున. వైఎస్ఆర్ కుటుంబంతో నాగార్జున ఆది నుంచి అవినావభావ సంబంధం ఉంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాగార్జున చాలా సార్లు కలిసి హైదరాబాద్ లోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక జగన్ సీఎం అయ్యాక కేవలం ఆయనను ఎప్పుడంటే అప్పుడు నేరుగా వెళ్లి కలవగలిగేంత చనువు కేవలం నాగార్జునకే ఉంది. అందుకే ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచాడు.. సినిమా విడుదల చేస్తే ఏపీలో టికెట్ల రేట్ల వివాదం ఉన్నా కూడా భరోసాగా ఉన్నాడు. టాలీవుడ్ అంతా జగన్ సర్కార్ టికెట్ రేట్లపై గుర్రుగా ఉంటే నాగార్జున మాత్రం తడిగుడ్డ వేసుకున్నట్టు ‘నాకేం ఇబ్బంది లేదు’ అని స్టేట్ మెంట్ ఇవ్వడం గమనార్హం.

    ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపు అంశంపై టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు జుట్టు పీక్కుంటున్నారు. ఏపీ ప్రభుత్వంతో తలపడేందుకు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆఖరుకు జగన్ కు బంధువైన మోహన్ బాబు సైతం టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని అన్నాడు.

    అయితే ఇంతమంది ఇన్ని రకాలుగా జగన్ సర్కార్ ను తిట్టిపోస్తున్నా ఒక్క స్టార్ హీరో నాగార్జున మాత్రం ఏపీలో టికెట్ల రేట్ల అంశంలో తనకు ఇలాంటి వివాదాలు లేవని కుండబద్దలు కొట్టడం టాలీవుడ్ లో సంచలనమైంది.

    సంక్రాంతికి ప్లాన్ చేసిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ సహా అన్ని వాయిదా పడడంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు నాగార్జున తన సినిమా ‘బంగర్రాజు’ను తాజాగా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఏపీలో టికెట్ల రేట్లు తక్కువపై విలేకరులు ప్రశ్నించగా.. ‘నాకు ఎలాంటి ఇబ్బంది లేదని.. టికెట్ రేట్స్ పెరిగితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే’ అంటూ జగన్ సర్కార్ ను వెనకేసుకొచ్చాడు. దీంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు షాక్ తగిలినట్టైంది.

    నిజానికి నాగార్జున ఏపీ సీఎం జగన్ కు చాలా క్లోజ్. నాగార్జున విషయంలో జగన్ ఎన్నో మినహాయింపులు ఇచ్చే ఉంటాడు. బెనిఫిట్ సహా అన్ని షోలకు అనుమతులు వచ్చే ఉంటాయి. అందుకే నాగార్జున కేవలం తన గురించి మాత్రమే ఆలోచించి మిగతా ఇండస్ట్రీని డోంట్ కేర్ అన్నట్టుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఏపీలో టికెట్ల రేట్ల వల్ల నష్టం పెద్దగా ఉండదని నాగార్జున అనడంతో ఇప్పుడు టాలీవుడ్ పుండు మీద కారం చల్లినట్టైంది. జగన్ ను వెనకేసుకొచ్చిన నాగార్జున తీరుతో ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.