Nagababu- Roja: మెగా బ్రదర్స్ పై ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా మొదట స్పందించేది నాగబాబే. పవన్, చిరంజీవిలపై ఆయన ఈగ వాలనీయరు. తాజాగా మెగా బ్రదర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి రోజాకు నాగబాబు ఘాటైన సమాధానం చెప్పారు. మంత్రి రోజా మాట్లాడుతూ… చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు మానవత్వం లేదు. వారు సమాజానికి చేసిందేమీ లేదు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి నటులు తమకు జీవితం ఇచ్చిన ప్రజలకు సేవ చేశారు. మెగా బ్రదర్స్ మాత్రం సొంత జిల్లాకు కూడా ఏం చేయలేదు. అందుకే వాళ్ళను ప్రజలు ఓడించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు రాజకీయ భవిష్యత్తు లేదు… అంటూ రోజా దారుణ వ్యాఖ్యలు చేశారు.

రోజా కామెంట్స్ పై నాగబాబు స్పందించారు. ఆయన ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. రోజా ఆరోపణలకు ఆయన ఘాటైన సమాధానం చెప్పారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి దాని అభివృద్ధి పక్కన పెట్టావు. పర్యాటక రంగం అభివృద్ధి అంటే నీవు పర్యటనలు చేయడం కాదు. దేశంలో ఏపీ టూరిజం ర్యాంకింగ్స్ లో అట్టడుగుకు పడిపోయింది. 18వ స్థానంలో నిలిచింది. టూరిజం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆధారపడ్డారు. వారంతా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందుల పాలవుతున్నారు.
గతంలో కూడా నువ్వు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను కించపరిచేలా మాట్లాడావు. నా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశావు. అయినా నేను స్పందించకపోవడానికి కారణం… నీ నోరు ఒక మున్సిపాలిటీ చెత్త తొట్టి అని నాకు తెలుసు. ఎవరూ మున్సిపాలిటీ తొట్టిని గెలకాలి అనుకోరు. అందుకే నీ కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వలేదంటూ… నాగబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నాగబాబు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగబాబు వ్యాఖ్యలను జనసేన వర్గాలు సమర్ధిస్తున్నాయి.

కాగా దాదాపు ఆరేళ్ళు రోజా, నాగబాబు జబర్దస్త్ జడ్జెస్ గా కలిసి పనిచేశారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న తరుణంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక రోజా చిరంజీవిపై కూడా ఆరోపణలు చేయడానికి కారణం ఉంది. ఇటీవల చిరంజీవి జనసేన పార్టీకి, పవన్ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారు. తాను ప్రత్యక్షంగా జనసేన పార్టీలో చేరుకున్నా… ఆ పార్టీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష బయటపెట్టారు.