https://oktelugu.com/

Thank You movie Twitter Review: థాంక్యూ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Thank You movie Twitter Review: ‘లవ్ స్టోరీ’ తర్వాత హీరో నాగచైతన్య ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కే కుమార్ లాంటి లాటెండెడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని తీయడంతో అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఈరోజు (జూలై 22న) సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. చైతన్యపై ఉన్న నమ్మకంతో అభిమానులు ఉత్సాహంగా థియేటర్లలోకి వెళ్లారు. మరి ఈ సినిమా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 22, 2022 / 10:22 AM IST
    Follow us on

    Thank You movie Twitter Review: ‘లవ్ స్టోరీ’ తర్వాత హీరో నాగచైతన్య ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కే కుమార్ లాంటి లాటెండెడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని తీయడంతో అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఈరోజు (జూలై 22న) సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. చైతన్యపై ఉన్న నమ్మకంతో అభిమానులు ఉత్సాహంగా థియేటర్లలోకి వెళ్లారు. మరి ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్స్ పడిపోగా.. సినిమా ఎలా ఉంది? ఏ మేరకు ఆకట్టుకుందనే విషయాలను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సినిమా టాక్ బయటకు వచ్చింది.

    Thank You movie Twitter Review

    ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మన జీవితంలో మన ఎదుగుదలకు కారణమైన వ్యక్తులకు ‘థాంక్యూ’ చెప్పాలన్న నేపథ్యంలో తెరకెక్కింది. నారాయణపురం అనే చిన్న గ్రామానికి చెందిన అభిరామ్ నుంచి వెళ్లి బిలియనీర్ ఎలా అయ్యాడన్నది కథ. ఒక కంపెనీకి యజమాని ఎలా అయ్యాడు? అతడు ఎప్పుడూ తన సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఎదిగాను అనుకుంటూబతికేస్తాడు. ఒకరోజు తన ప్రయాణం వెనుక చాలా మంది వ్యక్తులు ఉన్నారని తెలుసుకొని వారికి థాంక్యూ చెప్పాలని నిర్ణయించుకుంటాడు. మరి తను తన కృతజ్ఞత భావాన్ని ఎలా చూపిస్తాడన్నది సినిమా

    Also Read: Koffee With Karan 7: కాఫీ విత్ కరణ్ షోలో నాగచైతన్యతో విడాకులపై సంచలన విషయాలు పంచుకున్న సమంత

    విక్రమ్ కే. కుమార్ తన గత చిత్రాల మాదిరిగానే క్లాసిక్ టచ్ తో నిర్మించారు. నాగచైతన్యతోపాటు రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రధారులు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ఈ సినిమా చూసిన ఆడియెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ లో థాంక్యూ పై రివ్యూలు వస్తున్నాయి. థాంక్యూ సినిమాకు రెండు హైలెట్ అని.. ఒకటి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇంకొకటి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అద్భుతం అంటున్నారు. ఫస్లాఫ్ బాగుందని కొందరు.. సెకండ్ ఆఫ్ బోరింగ్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

    చైతన్య యాక్టింగ్ అద్భుతం అని.. ఎమోషనల్ సీన్స్ బాగా పండించారని.. చైతూ లుక్ ఈ సినిమాలో పూర్తి భిన్నంగా ఉందని కొనియాడుతున్నారు.

    Thank You movie Twitter Review

    ఇక ఫస్టాఫ్ కథలోకి తీసుకెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడని.. పాత్రల పరిచయం.. లవ్ ట్రాక్ చూపించడానికే ఎక్కువ సమయం అయ్యిందట.. అయితే సెకండాఫ్ మాత్రం హీరో పాత్ర చుట్టూనే ఫోకస్ చేశాడట.. కమర్షియల్ అంశాలు మిస్ అయ్యాయన్నది కంప్లైంట్ గా తెలుస్తోంది.

    అయితే ఈ మూవీ ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. చైతన్య మార్క్ సన్నివేశాలు మాత్రం లేవంటున్నారు. ఫ్యాన్స్ కొంత మంది నిరాశ చెందుతున్నారు. మిగిలిన యువతకు ఈ చిత్రం నచ్చుతుందని అంటున్నారు.

    Also Read: The Warrior Collections: ‘ది వారియర్’ 9 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ పరిస్థితి ఇదే

    Tags