Naga Chaitanya : సమంత అనుకున్నట్టే జరగాలి.. లేకుంటే నిద్రపోదు : నాగ చైతన్య

సమంత తో విడిపోయిన తర్వాత సమంత నాగ చైతన్య గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు కానీ, నాగ చైతన్య మాత్రం సమంత గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు

Written By: NARESH, Updated On : May 11, 2023 9:29 pm
Follow us on

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘కస్టడీ’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. టీజర్ మరియు ట్రైలర్ బాగున్నా కూడా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అక్కినేని ఫ్యామిలీ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్లే ‘కస్టడీ’ చిత్రం పై ఎఫెక్ట్ పడిందని అంటున్నారు విశ్లేషకులు. కానీ టాక్ వస్తే మాత్రం అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు.మరోపక్క నాగ చైతన్య వరుసగా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇంటర్వ్యూస్ ఒక తెలుగు మరియు తమిళం లో విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నాడు.ఎలాంటి మాస్క్ లేకుండా నాగ చైతన్య మాట్లాడుతున్న మాటలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

సమంత తో విడిపోయిన తర్వాత సమంత నాగ చైతన్య గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు కానీ, నాగ చైతన్య మాత్రం సమంత గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు రీసెంట్ ఇంటర్వ్యూస్ లో.ఆయన మాట్లాడిన మాటల్లో ఎలాంటి ఫేక్ లేదు, చాలా నిజాయితీగా మాట్లాడాడు. ఇంత కూల్ గా వ్యక్తిని సమంత ఎలా వదులుకుంది అంటూ నెటిజెన్స్ ఆమెని తిట్టసాగారు. రీసెంట్ గా ఆమె గురించి నాగ చైతన్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడాడు.

హీరోయిన్స్ గురించి గొప్ప క్వాలిటీస్ చెప్పమని ఒక్కో పేరు అడుగుతూ యాంకర్ ప్రశ్నించగా సమంత వంతు వచ్చినప్పుడు ఆమె గురించి నాగ చైతన్య మాట్లాడుతూ ‘సమంత చాలా దృఢమైన మనిషి, తన జీవితం లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదురుకోగలదు, ఆమె ఏదైనా అనుకుంటే అది జరిగి తీరాల్సిందే, జరిగే వరకు ఆమె నిద్రపోదు, అది ఎలాంటి విషయమైనా సరే’ అంటూ నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.