https://oktelugu.com/

Naa Anveshana: ఇదేం బీర్ రా అన్వేషూ.. ఇలాంటివి కూడా చెబుతావా..? చెప్పి తాగుతావా?

ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లినా.. ఏ ప్రాంతాన్ని సందర్శించినా భాష అనేది ముఖ్యం. ఎదుటి వ్యక్తితో మాట్లాడటం అనేది.. అతడికి అర్థమయ్యేలా చెప్పగలడం అనేది చాలా ముఖ్యం. అందువల్లే భాషా పరిజ్ఞానం ఉండాలి అంటారు. ఇక నేటి కాలంలో ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాషగా వెలుగొందుతోంది కాబట్టి... కొన్ని ప్రాంతాలు మినహా.. మిగతా అన్నింటిలోనూ ఇంగ్లీష్ భాష రాజభాషగా వర్ధిల్లుతోంది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 5, 2025 / 08:36 AM IST
    Naa Anveshana

    Naa Anveshana

    Follow us on

    Naa Anveshana: ఇంగ్లీష్ భాషకు, మన భాషకు తేడా ఉంటుంది. అందులో కొన్ని పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని మన తెలుగుకు అనుకూలంగా అనువదించి మాట్లాడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు అందులో బూతులు కూడా దొర్లుతుంటాయి. అందువల్లే కొన్ని కొన్ని పదాలను మన తెలుగుకు అనువదించుకోకుండా ఉండడం మంచిది. కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాదు జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్.. లో పదాలను కూడా అలాగే పలకాలి. వాటిని తెలుగీకరిస్తే చాలా బూతులు దొర్లుతుంటాయి.. ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ అన్వేషూ ఇటీవల జర్మనీ కి వెళ్ళాడు. అక్కడ బీర్లు విక్రయించే ప్రదేశానికి వెళ్ళాడు. సాధారణంగా జర్మనీలో జర్మన్ తో పాటు ఇంగ్లీషులో కూడా అక్షరాలు ఉంటాయి. కాకపోతే జర్మన్ పదాలలోనే ఉంటాయి.. అక్కడ లభించే బీర్ బ్రాండ్లలో “మోడేలో” అనేది ప్రముఖమైనది. దానిని అవినాష్ వేరే విధంగా పలికాడు. దీంతో బూతు ధ్వనించింది. తను మాత్రమే పలకడం కాకుండా.. ఆ బీర్లను విక్రయించే మహిళతోను ఆ పదాన్ని అతడు పలికించాడు. కాకపోతే ఆమె జర్మన్ భాషలో పలికింది. అవినాష్ మాత్రం అచ్చ తెలుగు పచ్చి బూతు లాగా పలికాడు.

    సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

    ఈ బీరు గురించి అన్వేషూ అదే పనిగా బూతు పదం మాట్లాడటం.. దానిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. అంతే అన్వేషూ కు విపరీతమైన రీచ్ ఉంటుంది కాబట్టి దెబ్బకి ఆ వీడియో మిలియన్లలో వ్యూస్ సొంతం చేస్తుంది. ఇక నెటిజన్లు దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ” నువ్వు ఆ పేరు పలుకుతున్నావ్ కదా.. దాన్ని ఎలా తాగుతావు అని” ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ” మాకెందుకీ మోడేలో గోల” అని మరొ నెటిజన్ అన్నాడు. ” ఇప్పుడు అక్కడికి నువ్వు ఎందుకు వెళ్లావు? దానిని అదే పదంతో ఉచ్చరించకుండా.. బూతు ఎందుకు ద్వనింపజేసేలా చేస్తున్నావ్.. అలా బూతు మాట్లాడి.. దానిని తాగాలంటే సిగ్గు అనిపించడం లేదా” అని ఓ నెటిజన్ నిలదీశాడు. కాకపోతే అవినాష్ కు కావాల్సింది ప్రచారం.. అతడు కోరుకునేది సోషల్ మీడియాలో చర్చ.. అంతేతప్ప తను మాట్లాడుతోంది బూతా? నీతా? అనేది పట్టించుకోడు. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అయిన తర్వాత అన్వేషూ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ట్రెండ్ కు తగ్గట్టుగా వ్యవహరించడం.. సోషల్ మీడియాలో రీచ్ పెంచుకోవడానికి ట్రిక్కులు ప్లే చేయడం నేర్చుకున్నాడు. అందువల్లే ఇలా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.