Mysterious Temple: భారతదేశం చారిత్రాత్మక దేవాలయాలకు నిలువు. ఎన్నో మతాలు, కులాల సంగమం మన భారతదేశం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆచారవ్యవహారం ఉంటుంది. కొన్ని ఆలయాలకు కూడా సపరేటు చరిత్ర, ఆచారం, సాంప్రదాయం ఉంటుంది. కొన్ని ఆలయాలలో అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ దాగి ఉన్నాయి. పరిశోధనలు చేసినా కూడా అంతుచిక్కని రహస్యాలు ఉన్న పేరుగాంచిన ఆలయాల గురించి కూడా తెలిసిందే. అలాంటి ఆలయాలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. అయితే అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న దేవల్ బ్లాక్ అడవిలో ఉంది. ఈ ఆలయం పేరు లాతూ మందిరం. ఇక్కడ వింత ఆచారం పాటిస్తారు. అంతుచిక్కని రహస్యాలకు కూడా ప్రసిద్ది ఈ ఆలయం. అయితే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు కళ్లకు గంతలు కట్టుకుంటారట. అంతేకాదు పూజారి కూడా నోటికి, కళ్లకు గంతలు కట్టుకోవాలంట. ఇలా ఆలయంలోకి వెళ్లి ఆ దేవతని దర్శనం చేసుకోవాలి. అయితే ఉత్తరాఖండ్ లోని నందాదేవి మతమరమైన సోదరిలాగా లాతు దేవతగా నమ్ముతారట స్థానికులు.
ఆ ప్రాంత ప్రజలు ఈ దేవతను చాలా భక్తిశ్రద్దలతో పూజిస్తారట. మరి ఎందుకు ఇలాంటి ఆచారం ఉందంటే.. నాగరాజు తన విలువైన రత్నాన్ని ధరించి లాతూ దేవాలయంలో దర్శనమిస్తాడట. అక్కడికి వెళ్లిన భక్తులు నేరుగా ప్రకాశిస్తున్న మణిని చూస్తే గుడ్డివారు అవుతారని నమ్ముతారు. అందుకే అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తారు అక్కడున్న ప్రజలు. అయితే ఈ ఆలయం ప్రతి రోజు తెరిచి ఉండదు. కేవలం వైశాఖ పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారట. ఈ రోజు దూరం నుంచే భక్తులు దర్శనం చేసుకొని వెళ్తారట.
పండితులు, ప్రజలు తమ కళ్లకు ఎలాంటి హానీ జరగకూడదని ఇలా దైవ దర్శనానికి వెళ్లినప్పుడు కళ్లకు గంతలు కట్టుకొని వెళ్తారట. మరి ఉత్తరాఖండ్ కి వెళితే ఈ గుడిని సందర్శించుకొని రండి. కానీ ప్రతి రోజు ఈ ఆలయం తెరిచి ఉండదని గుర్తుంచుకోండి.