Purple Cloud దక్షిణ అమెరికా ఖండంలో చిలీ దేశంలో గల ఒక పట్టణంలో ఆదివారం ఒక అద్భుత దృశ్యం అందరినీ ఆశ్యర్యపరిచింది. ఆకాశంలో ఊదా రంగు మేఘం(Purple Cloud) కనిపించింది. స్థానికులు , అధికారులను ఇది కలవరపరిచింది. స్థానికులు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో శక్తివంతమైన ఊదా రంగు మేఘాలను వీడియోలు, ఫొటోలు తీసి షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఆకాశం నిర్మలంగా ఉండి ఈ ఉదారంగు మేఘాలు కనిపించిన చిత్రాలను పోస్ట్ చేశారు. అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి స్థానిక అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

ఈ ఉదారంగు మేఘాలు ప్రజల్లో భయాన్ని సృష్టించింది. మేఘాలు పట్టణానికి అతి సమీపంలో ఉన్న కాలా కాలా గనిలో ఉద్భవించాయని తేలింది. ఇది విష వాయువులా? లేక మరేదైనా ప్రమాదమా? అని ప్రజలు హడలిచచ్చారు.. “అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇది బూస్టర్ పంప్ యొక్క మోటారు వైఫల్యం కారణంగా ఏర్పడిందని తేలింది” అని అక్కడి డిప్యూటీ ప్రాంతీయ డైరెక్టర్ మీడియాకు తెలిపారు.
ప్లాంట్‌లోని అయోడిన్ ఘనపదార్థం నుంచి వాయు స్థితికి మారడానికి పంపు వైఫల్యం కారణంగా ఆకాశంలోకి వెలువడిందని.. అది ఉదారంగు మేఘాలుగా ఏర్పడిందని పర్యావరణ అధికారి ఇమాన్యుయెల్ ఇబార్రా తెలిపారు.ఈ అయోడిన్ మేఘాల వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని.. వైద్య అవసరం ప్రజలకు ఏర్పడలేదని.. ప్రభావాలు లేవు ”అని అక్కడి అధికారులు తెలిపారు.
ఆ లీక్ అయిన కంపెనీ నిబంధనలు పాటించలేదని.. కట్టుబాట్లను పాటించనందుకు రేపు వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక అధికారులు 48 గంటల పాటు గని జరిగిన ప్రదేశంలో ఉండి తనిఖీలు చేశారు. అనంతరం ఆ ఉదారంగు మేఘం అదృశ్యమైంది.