Mahesh Babu- Rajamouli Movie: మహేష్ తో కూడా మల్టీస్టారరే… ఆ ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదిస్తున్న రాజమౌళి!

Mahesh Babu- Rajamouli Movie: సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ రాజమౌళి. ఆయన చేతిలో పడ్డ హీరోకి పాన్ ఇండియా ఇమేజ్ గ్యారంటీ. గ్లోబల్ వేదికలపై సదరు హీరో మూవీ ప్రదర్శించే అవకాశం పొందుతుంది. బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా గతిని మార్చేశాడు ఆయన. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. మూవీ విడుదలై తొమ్మిది నెలలు కావస్తున్నా సందడి చేస్తూనే ఉంది. జపాన్ బాక్సాఫీస్ కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ హైయెస్ట్ వసూళ్లు […]

Written By: Shiva, Updated On : December 31, 2022 10:20 am
Follow us on

Mahesh Babu- Rajamouli Movie: సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ రాజమౌళి. ఆయన చేతిలో పడ్డ హీరోకి పాన్ ఇండియా ఇమేజ్ గ్యారంటీ. గ్లోబల్ వేదికలపై సదరు హీరో మూవీ ప్రదర్శించే అవకాశం పొందుతుంది. బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా గతిని మార్చేశాడు ఆయన. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. మూవీ విడుదలై తొమ్మిది నెలలు కావస్తున్నా సందడి చేస్తూనే ఉంది. జపాన్ బాక్సాఫీస్ కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ హైయెస్ట్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా అవతరించింది. అనేక అంతర్జాతీయ అవార్డ్స్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచింది.

Mahesh Babu- Rajamouli Movie

ఈ క్రమంలో రాజమౌళి ఇమేజ్ విశ్వవ్యాప్తం అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం చూశాకా మహేష్ మూవీ మీద అంచనాలు మరింత పెరిగాయి. కారణం… బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు మించి మహేష్ మూవీ ఉంటుందని రాజమౌళి చెప్పారు. సినిమా బడ్జెట్ కూడా వెయ్యి కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక తాను చేయబోయే సినిమా కథ ఏంటో ముందే చెప్పడం రాజమౌళి స్టైల్. స్టోరీ లైన్ జోనర్ చిత్ర ప్రారంభానికి ముందే చెప్పేస్తారు.

మహేష్ మూవీపై కూడా ఆయన హింట్ ఇచ్చారు. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో తెరకెక్కుతుందని చెప్పారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడి కథగా ఉంటుంది అన్నారు. కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ సైతం ఇదే చెప్పారు. మహేష్ ఇమేజ్ కి యాక్షన్ అడ్వెంచర్ జోనర్ బాగా సెట్ అవుతుందని రాజమౌళి నమ్మాడు. మహేష్ కోసం చాలా కాలం క్రితం అనుకున్న కథకు మెరుగులుదిద్దామని ఆయన చెప్పుకొచ్చారు.

Mahesh Babu- Rajamouli Movie

ఇదిలా ఉంటే మహేష్-రాజమౌళి మూవీపై లేటెస్ట్ అప్డేట్ షాక్ ఇస్తుంది. ఆర్ ఆర్ ఆర్ మాదిరి ఇది కూడా మల్టీస్టారర్ అంటున్నారు. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ఆ హీరోగా రాజమౌళి మనసులో బాలకృష్ణ, విక్రమ్ ఉన్నారనేది తాజా సమాచారం. రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ విక్రమ్ అని తెలుస్తుండగా… ఆయన కాదన్న పక్షంలో బాలకృష్ణను తీసుకోవాలి అనుకుంటున్నారట. మరి ఇదే నిజమైతే రాజమౌళి-మహేష్ సినిమాకు ప్లస్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది ఊహాగానం మాత్రమే. కాగా 2023 మే లో పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ చిత్రం దసరాకి సెట్స్ పైకి వెళ్లనుందన్న ప్రచారం జరుగుతుంది.

Tags