MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఇతడి గురించి ప్రస్తావించకుండా ఇండియన్ క్రికెట్ ను వివరించలేం. ఇండియా ఇతడి సారధ్యంలో అనితర సాధ్యమైన విజయాలు సాధించింది. వరల్డ్ కప్ నుంచి టి20 పొట్టి ప్రపంచ కప్ వరకు అన్నింటిని తన ఖాతాలో వేసుకుంది. ధోని ట్రోఫీలు సాధించిన తర్వాత ఐసీసీ నిర్వహించే ఏ మెగా టోర్నీ ని టీమిండియా గెలుచుకోలేదంటే అతిశయోక్తి కాదు. 36 సంవత్సరాలకు పైబడి వయసు ఉన్నప్పటికీ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడంటే అతడికి ఆట మీద ఎలాంటి మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ధోనికి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. క్రికెట్లో మేరునగధీరులు అనుకునే ఆటగాళ్లు కూడా ధోనిని అభిమానిస్తారు.
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ధోని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరిగేస్తున్నాడు. అలాంటి ధోని కుటుంబంతో విహార యాత్రకు వెళుతూ ఒక విమానంలో కనిపించాడు. మిస్టర్ కూల్ గా కనిపించే ధోని విమానంలోనూ ఎటువంటి హడావిడి లేకుండా విండోపక్క సీట్ల కూర్చున్నాడు.. అతని పక్కకు ఎయిర్ హోస్టెస్ చాక్లెట్లతో ఉన్న ట్రే పట్టుకుని వెళ్ళింది. ఆ సమయంలో ధోని క్యాండీ క్రష్ ఆడుతున్నాడు. ఆ ట్రే ను చూసిన ధోని ఒక నవ్వు నవ్వాడు. ఎయిర్ హోస్టెస్ కూడా చిరునవ్వుతో బదులిచ్చింది. ఒక చాక్లెట్ చాలు అంటూ ఎయిర్ హోస్టస్ కు కంటిచూపుతో సైగ చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టిం ట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది గంటలోనే లక్షల మంది వీక్షించారు. ధోని ఎక్కువ తక్కువ ఏదీ తినడని, తిండి విషయంలో ఆయనకు కొన్ని లెక్కలు ఉన్నాయని అతడి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.” ధోని దెబ్బకు క్యాండీ క్రష్ డౌన్లోడ్ పెరుగుతాయని, ఆ కంపెనీ సర్వర్ క్రాష్ కాకుండా చూసుకోవాలని” ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ” క్యాండీ క్రష్ లో ధోని ఏ లెవెల్ లో ఉన్నాడో” అంటూ మరో నెటిజన్ చలోక్తి విసిరాడు.
The way he winks his eyes
Also the way she is acting kittenish while having is wife right next to himWhat a video @msdhoni pic.twitter.com/SkrhQeZnDE
— LEO (@BoyOfMasses) June 25, 2023