Waltair Veerayya : రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా.. చిరంజీవి సంచలన ప్రకటన

Waltair Veerayya : ఖైదీ నెంబర్ 150 మరియు సైరా నరసింహా రెడ్డి వంటి సూపర్ హిట్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల్లో ఎక్కువగా మరో హీరో ని పెట్టుకుంటూ వస్తున్నాడు..ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు..కానీ కొరటాల శివ వీక్ డైరెక్షన్ వల్ల ఆ డిజాస్టర్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది..తర్వాత ఆయన తీసిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో సత్య దేవ్ మరియు సల్మాన్ ఖాన్ […]

Written By: NARESH, Updated On : December 27, 2022 11:32 pm
Follow us on

Waltair Veerayya : ఖైదీ నెంబర్ 150 మరియు సైరా నరసింహా రెడ్డి వంటి సూపర్ హిట్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల్లో ఎక్కువగా మరో హీరో ని పెట్టుకుంటూ వస్తున్నాడు..ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు..కానీ కొరటాల శివ వీక్ డైరెక్షన్ వల్ల ఆ డిజాస్టర్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది..తర్వాత ఆయన తీసిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో సత్య దేవ్ మరియు సల్మాన్ ఖాన్ వంటి హీరోలను పెట్టుకున్నాడు..ఈ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.

ఇప్పుడు లేటెస్ట్ గా మెగాస్టార్ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా నటించాడు..అయితే ఈ సినిమా మాత్రం గత రెండు చిత్రాల లాగ కాకుండా చాలా ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే రేంజ్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఔట్పుట్ వచ్చిందట..ఈ సందర్భంగా మూవీ టీం మొత్తం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.

ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేకరి చిరంజీవి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘రామ్ చరణ్ , సల్మాన్ ఖాన్ , రవితేజ లతో సినిమాలు చేసేసారు..మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు సినిమా చేస్తారు సార్’ అని అడగగా, చిరంజీవి దానికి సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ ఒప్పుకుని సినిమాలు ముందు పూర్తి అవ్వాలి..అవి అవ్వడానికి రెండేళ్ల సమయం పడుతుంది..అప్పుడు ఆలోచించాలి’ అంటూ సమాధానం చెప్తాడు..నిజానికి ఈ కాంబినేషన్ కోసం కేవలం మెగా అభిమానులే కాదు..యావత్తు సినీ లోకం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.

కానీ ఇనాళ్ళు వీళ్లిద్దరు ఇండస్ట్రీ లో ఉంటున్నా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాకపోవడం బాధాకరం..మధ్యలో శంకర్ దాదా MBBS , శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ చిన్న గెస్ట్ పాత్రలో కనిపిస్తాడు కానీ పూర్తి స్థాయి సినిమా మాత్రం వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటి వరకు రాలేదు..భవిష్యత్తులో అయినా వస్తుందో లేదో చూడాలి.