Elephant Manhole: అమ్మ ప్రేమ అమృతం కన్నా విలువే. చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లులు మాత్రం ఉండరు. తన బిడ్డ కోసం కన్న ప్రేమ ఆవేదన అంతా ఇంతా కాదు. తమ పిల్లల బాగోగుల కోసం కన్నవారు పడే బాధలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నిజంగా అందులో ఎలాంటి స్వార్థం ఉండదు. నిర్మలమైన ప్రేమ తప్ప ఇతర కారణాలేవి ఉండవు. తమ పిల్లలకు ఇంత గాయమైనా తట్టుకోలేరు. విలవిల ఏడ్చేస్తారు. తగ్గే వరకు సపర్యలు చేస్తారు. కన్న వారి సేవలనే నిరంతరం తపిస్తారు. కానీ చివరకు మాత్రం ఆ పిల్లలే అవమానం చేసినా తమ ప్రాప్తం అనుకుంటూ కాలం వెళ్లదీస్తారు.

థాయ్ లాండ్ లోని నఖోన్ నాయక్ ప్రాంతంలో ఏడాది వయసున్న ఓ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయింది. దీంతో తల్లి ఏనుగు తల్లడిల్లిపోయింది. పిల్లను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ లాభం లేకపోయింది. దీంతో గుంత చుట్టూ తిరుగుతూ పిల్ల ఏనుగు కోసం కలత చెందింది. తన బిడ్డను ఎలాగైనా కాపాడాలని భావించింది. కానీ తన వల్ల కాకపోవడంతో ఒత్తిడికి గురై మూర్చపోయింది. విషయాన్ని స్థానికులు జూ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో వారు వచ్చి వాటిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు.
తల్లి ఏనుగుకు స్ర్పహ వస్తే కాపాడటం కష్టమని దానికి మత్తు మందు ఇచ్చి పిల్లను కాపాడారు. అనంతరం తల్లి ఏనుగుకు కూడా స్ప్రహ రావడంతో రెండు కలిసి అడవిలోకి వెళ్లిపోయాయి. దీంతో స్థానికులు వారిని అభినందించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం హల్ చల్ గా మారింది. తల్లి ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జంతువైనా తనలోని తల్లిప్రేమను వ్యక్తిపరచిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది.

మొత్తం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తల్లి, పిల్ల ఏనుగుల ప్రేమకు అందరు మంత్రముగ్దులవుతున్నారు. తల్లిబిడ్డల అనుబంధంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన వారికి ఏనుగుల తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమకు ఎల్లలు లేవని చెబుతూ వాటి ప్రేమను వ్యక్తం చేయడంలో జంతువులే మనుషులకంటే నయం అనిపిస్తోంది. అదే మనుషులైతే ఇంతలా ప్రేమ చూపించే వారా? అని ప్రశ్నిస్తున్నారు. జంతువులైనా మనుషులకంటే ప్రేమను వ్యక్తం చేయడంలో అవే గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. మొన్న మేక, నిన్న ఏనుగు ప్రేమలను చూసిన నెటిజన్లు మురిసిపోతున్నారు.