Balakrishna- NTR: ‘బాలయ్య బాబు’ క్రేజ్ ఈ మధ్య డబుల్ అయింది. అందుకే, ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు బాలయ్య. అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత బాలయ్య ఎలాంటి సినిమాలతో వస్తాడా ? అని ఆశగా ఎదురుచూసారు ఫ్యాన్స్. ‘అఖండ’ అందించిన సక్సెస్ ఊపులో వరుస సినిమాలు అంగీకరిస్తున్నాడు బాలయ్య. అయితే మాకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఒక దిమ్మదిరిగే కాంబినేషన్ లో సినిమా కథ విన్నాడట.

ఆ కథ బాలయ్యకు చాలా బాగా నచ్చిందట. ఇది మల్టీస్టారర్ అని, తండ్రీ కొడుకుల మధ్య కథ అని తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్ తో కాంబినేషన్ లో కనుక ఈ సినిమా చేస్తే చాలా బాగుంటుందట. బాలయ్య కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని.. అవసరం అయితే, చరణ్ తో కూడా కలిసి నటిస్తా అంటూ బాలయ్య క్లారిటీ ఇచ్చాడట.
Also Read: Sushmita Sen: సుస్మితా సేన్.. ఆమె ఏ బంధంలోనూ ఇమడదు
తనకు ఎలాంటి ఇగోలు లేవు అని, కాబట్టి మల్టీస్టారర్ సినిమా చేస్తాను అని బాలయ్య స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాని వర్కవుట్ చెయ్యడానికి చర్యలు జరుగుతున్నాయి. అసలు ఎన్టీఆర్, బాలయ్య కాంబినేషన్ అంటేనే మహా పిచ్చి లేస్తుంది అభిమానులకి. నందమూరి అభిమానులని, ఎన్టీఆర్ అభిమానులని వేర్వేరుగా ఉన్నప్పటికినీ, బాలయ్య – ఎన్టీఆర్ ఇద్దరినీ ప్రేమించే వారు, అభిమానించేవారు చాలా మంది ఉన్నారు.
అవును ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు హీరోలంతా.. తమ అభిమానుల లెక్కలు మాని, ఒక మంచి కథ కోసం కలిసి పనిచేస్తే.. ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు వస్తాయి. మొత్తానికి బాలయ్య ఇండస్ట్రీ హిట్లు కోసం శ్రీకారం చుట్టాడు. ఆన్ స్టాపబుల్ షోతోనే బాలయ్య ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని నిరూపించాడు. ఇప్పుడు మల్టీస్టారర్ కూడా చేస్తే.. ఇక బాలయ్య క్రేజ్ తారా స్థాయికి చేరుకుంటుంది.

ఏది ఏమైనా ‘బాలయ్య బాబు’ అరవై ఏళ్ల వయసులో కూడా సినిమాల వేగం మాత్రం తగ్గించడం లేదు. దీనికి తోడు, ఈ మధ్య బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు.